పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మీరు ‘విజయం' మరియు 'విపత్తు'లు కలిగిన సందర్భాలను ఒకేలా చూడగలిగితే

జన సమూహం మధ్య మాట్లాడుతున్నప్పుడు కూడా మీ ఔన్నత్యం చెక్కుచెదరదు.

మీరు రాజుల మధ్య నడిచేటప్పుడు కూడా సామాన్యుడి చేతిని విడువరు

మీరు ప్రతిఒక్కరి హృదయాలలో ఎప్పటికి నిలిచి ఉంటారు'

-రుడ్యార్డ్ కిప్లింగ్

7. ఈ వాక్యాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నిజమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి. ఆయన పాలనలో 'కష్టాలు రాకుండా ఎల్లవేళలా నిరోధించలేనప్పటికీ, ఆ కష్టాలను మంచి మార్గాల ద్వారా ఎదుర్కోవచ్చనే భరోసాను' మనము చూస్తున్నాము. మరో మాటలో చెప్పాలంటే విజయాన్ని పొందినపుడు ఉదారంగా ఉండడం, కష్టాలను ఎదుర్కొనే ప్రతికూల సమయాలలో దృఢంగా ఉండటం ఆయన లక్షణాలు.

8. విధానపరమైన ఆవిష్కరణలు మరియు వినూత్న పాలనా విధానాలు మా ప్రభుత్వం యొక్క విశిష్ట లక్షణాలు. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం నవరత్నాలు మరియు మ్యానిఫెస్టోలో పెట్టిన పథకాలు ఆధారంగా రూపొందించిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒక సమ్మిళిత విధానాన్ని మా ప్రభుత్వం అవలంభించింది.

9. మా మ్యానిఫెస్టో యొక్క ముఖ్య లక్షణాలు సుస్థిర అభివృద్ధి మరియు సుపరిపాలన అనే సూత్రాల సమ్మేళనం. మా ప్రభుత్వం, పాలనలో మొదటి సంవత్సరమే ఈ సూత్రాలన్నింటినీ దాదాపుగా అమలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సూత్రాలు అమలులో ఎన్నో అవాంతరాలు ఏర్పడినప్పటికీ, వెనుకంజ వేయకుండా వీటన్నింటినీ సంపూర్ణంగా అమలు చేస్తున్నాము. నిజానికి, మా మేనిఫెస్టోలోని వాగ్దానాలకు మించి మా ప్రభుత్వం పనిచేస్తోంది.

10. వినూత్నమైన పాలనా విధానాల ఫలితంగా నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాల ఏర్పాటు; 1.34 లక్షల ఉద్యోగుల నియామకం; 2.65 లక్షల మంది వాలంటీర్ల నియామకం; 51,488 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.) ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోనికి

3