పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాను, షెడ్యూలు కులాల మరియు తెగల నివాసాలలోని ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తోంది. దీనితో పాటు దోభీఘాట్లకు, దారిద్య్రరేఖకు దిగువనున్న రజక కుంటుంబాలకు, వెనుకబడిన కులాలవారికి, చేనేత కార్మికులకు, క్షౌరశాలలకు విద్యుత్ రాయితీని వర్తింపచేస్తున్నాము.

108. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు విద్యుత్ రాయితీని చిన్న గ్రానైట్ యూనిట్లకు ఒక యూనిట్ కి 2 రూపాయలుగా ప్రకటించారు. నాపరాతి యూనిట్లకు కూడా ఇదే విధమైన ప్రయోజనాన్ని వర్తింపజేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

109. మా ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ కోసం నగదు బదిలీ విధానాన్ని ప్రారంభించింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. రైతులపై భారం ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇంధన శాఖకు 6,546 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పరిపాలన

110. గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం అనేవి వికేంద్రీకృత, పౌర-కేంద్రీకృత, పారదర్శక పాలన యొక్క మరొక విశిష్ట నమూనా. దీనిని మా ప్రభుత్వం ఆగష్టు 15, 2019 నుండి ప్రజలకు అందిస్తోంది. కుల, మత, ప్రాంత, లింగ మరియు వారి వారి రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా, అన్ని సంక్షేమ పథకాలు మరియు సేవలు అర్హులైన లబ్దిదారులకు అందించబడుతున్నాయి. పౌరుల అన్ని అవసరాలను తీర్చడానికి గ్రామ మరియు వార్డు సచివాలయాల 'వన్ స్టాప్ సొల్యూషన్' గా మారాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మరియు మన రాష్ట్ర పౌరుల శ్రేయస్సు కోసం సురక్షితమైన, ఆరోగ్యకరమైన, సంపన్న వాతావరణాన్ని నిర్మించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం శాఖకు 3,858 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

36