పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పర్యావరణం మరియు అడవులు

'మనం మొక్కలు నాటడం అంటే, ఆశ మరియు శాంతి అనే విత్తనాలను నాటినట్లే.

మన పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించినట్లే'

-వంగారి మాతాయి

106. మన రాష్ట్రం విభిన్న పర్యావరణ వ్యవస్థలను మరియు వివిధ ఆవాసాలను కలిగి ఉంది. పౌరులకు స్థిరమైన నివాస స్థలాన్ని సృష్టించడానికి భౌగోళిక ప్రాంతంలో 33 శాతం వరకు పచ్చదనాన్ని కలిగి ఉండడం దానిని రక్షిస్తూ అభివృద్ధి పరచడం చాలా అవసరమని మా ప్రభుత్వం గుర్తించింది. దీనిని సాధించేందుకు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో జగనన్న పచ్చతోరణం క్రింద అన్ని శాఖలు, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో మరియు కాంపెన్సేటరీ అఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (సి.ఎ.యం.పి.ఎ.), మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రాష్ట్ర ఇతర అభివృద్ధి పథకాలు మరియు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సమకూర్చుకోవడం ద్వారా 3.05 కోట్ల మొక్కలను నాటే భారీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నగర వనం పథకం క్రింద పట్టణ మరియు పట్టణ శివారులలో విరామ సమయాలలో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి వినోదం మరియు శ్రేయస్సు కోసం పార్కులు మరియు గ్రంథాలయాల అభివృద్ధి చేయాలని కూడా మా ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వాతావరణాన్ని తట్టుకునే నగరాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాము. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను పర్యావరణం, అటవీ, శాస్త్ర మరియు సాంకేతిక శాఖకు 685 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

ఇంధనం

107. సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఇంధన భద్రత తప్పనిసరి. వెనుకబడిన వర్గాలకు, దారిద్య్రం రేఖకు దిగువన ఉన్నవారికీ 7వ సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనదిశగా సరసమైన, నమ్మదగిన మరియు సమర్థవంతమైన ఇంధన సేవలను 2030 నాటికి సార్వత్రికంగా అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, మా ప్రభుత్వం 18.74

35