పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పునర్నిర్మాణ మరియు పునరావాస పనులు ఏక కాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము.

102. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని జిల్లాలలో జలయజ్ఞం క్రింద సత్వర సాగునీటి సౌకర్యానికి భరోసాతో కూడిన త్రాగునీరు అందించడానికి, పరిశ్రమలకు నీరు అందించేందుకు చేపట్టిన అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించే దిశగా, నాగావళి మరియు వంశధార నదుల అనుసంధానాన్ని, 2023 మార్చి నాటికి మరియు వంశధార ప్రాజెక్ట్ రెండవ దశ లోని స్టేజ్-2 పనులను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవడమైనది.

103. నల్లమల సాగర్ కు నీరందించేందుకుగాను పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తికానున్నది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ మరియు రెండవ దశలను డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక చేయబడింది. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ యొక్క మొదటి దశను మార్చి 2025 నాటికి మరియు రెండవ దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమైనది.

104. పంట కోత సమయంలో ఎదురయ్యే ప్రతికూల విపత్తులను నివారించడానికి చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా గోదావరి డెల్టాకు జూన్ 1, 2022 న మరియు కృష్ణా డెల్టాకు జూన్ 10, 2022న నీటిని విడుదల చేయడం జరిగింది. జూలై 31, 2022 న నాగార్జున సాగర్ ప్రాజక్టు కాలువలకు ముందస్తుగా నీటిని విడుదల చేయడం వలన రైతులు ఖచ్చితమైన పంట దిగుబడిని సాధించగలిగారని గౌరవ సభకు తెలియచేసుకుంటున్నాను.

105. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల రూపాయలను నేను ప్రతిపాదిస్తున్నాను.

34