పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సహాయం అందజేస్తూ తద్వారా వారి జీవనోపాధికి భరోసాను కల్పిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం కోసం 200 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న తోడు

80. ఈ పథకం క్రింద చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, సాంప్రదాయ హస్తకళాకారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి బ్యాంకుల ద్వారా సున్నా వడ్డీకి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించటం జరుగుతుంది. ఈ పథకం క్రింద 15.31 లక్షల లబ్దిదారులకు ప్రయోజనాన్ని చేకూర్చడం గర్వించదగ్గ విషయం. ఈ పథకం క్రింద పంపిణీ చేసిన రుణం మొత్తం సుమారు 2,470 కోట్ల రూపాయలు. జగనన్న తోడు పథకం క్రింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి 35 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న చేదోడు

81. రజకులు, నాయీ బ్రాహ్మణులు మరియు దర్జీలు సమాజానికి అపారమైన మరియు తిరుగులేని సేవలను అందిస్తున్నారు. అవ్యవస్థీకరమైన అధిక వడ్డీ ఋణాలపై వారు ఆధారపడటాన్ని తగ్గించడం మరియు స్వయం ఉపాధి కొనసాగించడం కోసం ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం అందజేస్తోంది. జగనన్న చేదోడు పథకం క్రింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. వాహనమిత్ర

82. సొంత వాహనాన్ని కలిగి ఉన్న టాక్సీ, క్యాబ్ మరియు ఆటో డ్రైవర్ల సేవలను అభినందిస్తూ వారి వృత్తిలోని సవాళ్ళను ఎదుర్కొనేందుకు సంవత్సరానికి 10 వేల రూపాయల సహాయంను అందజేస్తుంది. ఈ సహాయం వారి వాహన బీమా, మరమ్మతులు మరియు ఇతర నిర్వహణ ఛార్జీల కోసం ఉపయోగపడుతుందని భావించడమైనది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వై.ఎస్.ఆర్. వాహనమిత్ర పథకం క్రింద 275 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

28