పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా అర్హులైన మహిళా లబ్దిదారులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వై.ఎస్.ఆర్. కాపు నేస్తం కోసం 550 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. బీమా

77. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో కుటుంబాన్ని పోషించే వ్యక్తికి సహజ లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు బీమా రక్షణను అందించడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జూలై 1, 2021 న వై.ఎస్.ఆర్. బీమా పథకాన్ని ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన 1.21 కోట్ల మంది ఈ పథకం క్రింద నమోదు చేసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వై.ఎస్.ఆర్. బీమా కోసం 372 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. ఈ.బి.సి. నేస్తం

78. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వారి స్వయం ఉపాధికి మార్గాలు కల్పించడం కోసం, మా ప్రభుత్వం 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందచేస్తున్నాము. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వై.ఎస్.ఆర్. ఈ.బి.సి. నేస్తం కోసం 610 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం

79. చేనేత వృత్తి ప్రపంచంలోని పురాతనమైన వృత్తులలో ఒకటి. మన రాష్ట్రంలోని నేత సంఘాలు శతాబ్దాలుగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతికూల పరిస్థితులలో కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడి పొందూరు ఖద్దరు, ఉప్పాడ, ధర్మవరం పట్టు, మంగళగిరి కాటన్ మరియు శ్రీకాళహస్తి కలంకారీ నమూనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. దీనిని గుర్తిస్తూ మా ప్రభుత్వం ప్రతీ నేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక

27