పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారికి 3 కార్పోరేషన్లు మరియు షెడ్యూలు తెగలకు చెందిన వారికి 1 కార్పోరేషన్ ను ఏర్పాటు చేసింది.

74. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం అల్పసంఖ్యాక వర్గాల అవసరాలను తీర్చడానికి తగిన కేటాయింపులు జరిగేలా మా ప్రభుత్వం మైనార్టీ కాంపోనెంట్ను అమలు చేస్తుంది. మా ప్రభుత్వం నెలకు, మౌజన్ లకు 5,000 రూపాయలు, ఇమామ్ లకు 10,000 రూపాయలు, పాస్టర్లకు 5,000 రూపాయలను గౌరవ వేతనంగా చెల్లిస్తుంది. ఈ వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు వివాహ ఖర్చుల కోసం ప్రభుత్వం వై.ఎస్.ఆర్. షాదీ తోఫాను అమలు చేస్తోంది. హజ్ యాత్రికులు మరియు జెరూసలేం యాత్రికుల ప్రయాణ ఖర్చులకు మా ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక

75. ప్రమాణ స్వీకారం చేసిన నాడే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చేసిన మొదటి నిర్ణయం ద్వారా అంతకుముందు సుమారు 5 సంవత్సరాలపాటు 1,000 రూపాయలగా ఉన్న పింఛను మొత్తాన్ని 2,250 రూపాయలకు పెంచడం ద్వారా పింఛనుదారులు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేటట్లు చేయడం. మేనిఫెస్టోలో చెప్పిన హామీకి అనుగుణంగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలోని 64.45 లక్షల మంది పింఛనుదారులకు జనవరి 1, 2023 నుండి ప్రభుత్వం వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుకను నెలకు 2,750 రూపాయలకు పెంచింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా మున్ముందు ఈ పింఛన్ను 3,000 రూపాయలకు పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాము. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక కోసం 21,434 కోట్ల రూపాయలు కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. కాపు నేస్తం

76. మా ప్రభుత్వం ఇప్పటివరకు కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వర్గాలకు చెందిన 45 నుండి 60 సం॥ల మధ్య వయస్సు గల మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం వై.ఎస్.ఆర్. కాపు నేస్తం పథకం క్రింద ఇప్పటి వరకు 1,997 కోట్ల రూపాయల సహాయం అందించింది.

26