పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండపల్లి కోటలోను అమలు చేయడం జరిగింది. ఈ అధునాతన డిజిటల్ టెక్నాలజీలను ఏలూరు మరియు అనంతపురం మ్యూజియంలలో కూడా ఇప్పుడు అమలు చేయనున్నాము.

71. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను యువజన అభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి శాఖ కోసం 291 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

సి. సామాజిక భద్రత

"న్యాయమైన సమాజం అంటే, దానిపట్ల గౌరవం పెరగటం మరియు

ధిక్కార భావం తగ్గటం. ఇది కరుణ గల సమాజ నిర్మాణంలో మాత్రమే సాధ్యం.”

- డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్

72. సాంఘిక సంక్షేమంలో ప్రభుత్వ చొరవ అనేది జీవనోపాధిని రక్షిస్తూ మరియు సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి సహాయాన్ని అందిస్తూ ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సామాజిక భద్రత మరియు సంక్షేమంపై పెట్టిన ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయం శాతం 4.7 మాత్రమే. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి 13 శాతంగా ఉందని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. మా ప్రభుత్వం సామాజిక భద్రతా విధానాల ప్రయోజనకరమైన ప్రభావాన్ని పరిశీలిస్తే, మా ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన లబ్దిదారులకు అందజేసే అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్నాము.

73. రాష్ట్రంలోని షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల, అల్పసంఖ్యాక వర్గాల, కాపు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారి పరిపూర్ణ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మా ప్రభుత్వం వెనుకబడిన తరగతి వర్గాలకు 56 కార్పోరేషన్లు, షెడ్యూలు కులాలకు చెందిన

25