పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు క్రీడల కోటా క్రింద, రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్య, దంత వైద్య విద్య, ఇంజనీరింగ్ మొదలైన వృత్తిపరమైన కోర్సుల ప్రవేశాలలోను, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలోని నియామకాలలోను మా ప్రభుత్వం రిజర్వేషను అమలు చేస్తోంది.

68. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన అభివృద్ధి చోదక శక్తి అయిన పర్యాటక రంగాన్ని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో మౌలిక సదుపాయాలైన థీమ్ పార్కులు, వినోద ఉద్యానవనాలు, పర్యాటక సౌకర్యాలు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో వసతి సదుపాయాలు, హోటళ్లు మొదలైన వాటిని అభివృద్ధి చేయడం ద్వారా మన రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మార్చడం ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2020-2025 యొక్క లక్ష్యం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు ఇటీవల మన రాష్ట్రంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు లభించిన విశేష స్పందనే నిదర్శనం. మన రాష్ట్ర పర్యాటక రంగంలో సుమారు 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 181 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

69. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి చిహ్నంగా స్మృతి వనాన్ని నిర్మిస్తోంది. ఇందులో ప్రతిష్టాత్మకంగా 125 అడుగుల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన చేపట్టింది. ఈ స్మృతి వనంలో 2 వేల మంది కూర్చోగల ఒక ఆడిటోరియం, 500 మంది కూర్చోగల ఒక ఓపెన్ థియేటర్ మరియు ఒక ధ్యాన మందిరం కూడా ఉంటాయి.

70. మన రాష్ట్రం యొక్క గొప్ప వారసత్వం మరియు సంస్కృతిపై అవగాహన కల్పించడం మరియు ప్రచారం చేయడం మా ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రయత్నంలో, రాష్ట్రంలోని మ్యూజియం సందర్శకులకు సుసంపన్నమైన అనుభవాన్ని అందించడానికి అధునాతన డిజిటల్ ఇంటరాక్టివ్ డిస్ప్లే టెక్నాలజీలు, వర్చువల్ రియాలిటీ, ప్రేక్షకులను ప్రత్యక్షంగా లీనంచేసే ప్రదర్శనల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విజయవాడలోని బాపు మ్యూజియంలోను మరియు

24