పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరోగ్య సంరక్షణ, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తదితర రంగాలలో 50,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు నైపుణ్యాన్ని కల్పించడం కోసం ఏటా ప్రణాళికలు రూపొందిండం జరిగింది.

64. పారిశ్రామిక విలువల పెంపుదల కోసం నైపుణ్యాలను బలోపేతం చేసే కార్యక్రమం (STRIVE) క్రింద పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐ.టి.ఐ.) లలో నైపుణ్యాభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలను కూడా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అల్ప సంఖ్యాక వర్గాల వారి కోసం రెండు కొత్త పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఆదోని మరియు రాయచోటిలలో స్థాపించబోతున్నాము. 18 రకాల నైపుణ్యాలలో ద్వంద్వ శిక్షణా విధానాన్ని నిర్వహించుకోవడానికి 81 పారిశ్రామిక శిక్షణా సంస్థలు మరియు 154 మంది విభిన్న రంగాలకు చెందిన పారిశ్రామిక భాగస్వాముల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల వలన విద్యార్థులు తమ శిక్షణా కాలవ్యవధిలో సగం కాలాన్ని పరిశ్రమలలో ఉద్యోగ శిక్షణ పొందేందుకు వెచ్చించడం వలన విద్యార్థులు తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోగలుగుతారు. 65. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధికి 1,166 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

యువజన అభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి

'ఒక దేశం యొక్క యువత తమ భావితరాలకు నిర్ణేతలు.'

- బెంజమిన్ డిప్రెలీ

66. మా ప్రభుత్వం చక్కని క్రీడా సౌకర్యాలను కల్పించడం ద్వారా మన రాష్ట్ర యువతను దేశంలోనే అత్యంత ఆరోగ్యకరంగా, సంతోషకరంగా మరియు పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన వ్యక్తులుగా రూపొందించాలని భావిస్తోంది. ప్రభుత్వం 39 క్రీడా వికాస కేంద్రాలకు సంబంధించిన పనులను పూర్తి చేయగా 67 కేంద్రాలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను.

23