పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాజెక్టు' ను అమలు చేస్తోంది. ఇప్పటివరకు 1,737 కి.మీ. రహదారుల పొడవుతో సుమారు 1,198 ఆవాసాలు ఈ ప్రాజెక్టు క్రింద అనుసంధానం చేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సం॥లో 3,692 కి.మీ. రహదారి పొడవుతో అదనంగా 2,461 ఆవాసాలను కలుపుటకు ఈ ప్రాజెక్టు క్రింద ప్రణాళిక చేయబడింది. ప్రయోజనకరమైన ఈ రహదారుల అనుసం

58. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 15,873 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పట్టణ అభివృద్ధి

59. 11వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సుస్థిర నగరాలు మరియు సమాజాల అభివృద్ధి. చక్కగా నిర్వహించబడుతున్న పట్టణ అభివృద్ధి మరియు పౌర కేంద్రీకృత సేవలను అందించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ, వార్డు సచివాలయం మరియు వార్డు వాలంటీర్ వ్యవస్థల ద్వారా 123 పట్టణ స్థానిక సంస్థలన్నింటిలోను పట్టణ స్థాయి సేవలు అన్నీ జవాబుదారీగా, పారదర్శకంగా మరియు సమర్ధవంతంగా అందించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.

60. మంగళగిరి, తాడేపల్లి పురపాలక ప్రాంతాలలో మౌలిక వసతులు, సేవలను మెరుగుపరిచి నమూనా పట్టణాలుగా ఉండేటట్లుగా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉన్నది. అదే సమయంలో, ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలలో పురపాలక పాఠశాలల పరివర్తన పథకాన్ని అమలు చేస్తోంది. పురపాలక ప్రాంతాలలో ఉన్న ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం మరియు వ్యర్థాలను పారవేయడం, పరిసరాల గాలి నాణ్యత మరియు త్రాగు నీటిని మెరుగుపరచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తగిన శ్రద్ధ తీసుకుంటోంది.

61. ఇటీవల జరిగిన ప్రపంచ పెట్టుబడుదారుల సదస్సు తర్వాత, విశాఖపట్నంలో మార్చి 28 మరియు 29 తేదీలలో ఫైనాన్స్ ట్రాక్ క్రింద జి-20 మౌలిక వసతులను ఏర్పాటు చేసే వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించేందుకు మా ప్రభుత్వం సిద్ధమవుతోంది. రోడ్లు వేయడం, 21