పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2023-24.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం 29,690 కోట్ల రూపాయల మరియు ఉన్నత విద్య కోసం 2,064 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

గ్రామీణాభివృద్ధి

'భారత దేశ ఆత్మ గ్రామాలలో నివశిస్తుంది.'

-మహాత్మా గాంధీ

54. మా ప్రభుత్వం సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో శాశ్వతమైన ఆస్తులను సృష్టించడానికి 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా హామీ పథకం (M.G.N.R.E.G.S.) ను అమలు చేస్తోంది. ఈ ఆస్తులలో 10,917 గ్రామ సచివాలయ భవనాలు, 10,243 వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే నిర్మాణాలు, 8,320 భారత్ నిర్మాణ సేవా కేంద్రాలు, ఎక్కువ మోతాదులో పాల శీతలీకరణ చేసే 3,734 పాల శీతలీకరణ యూనిట్లు మరియు నీటి సంరక్షణా కట్టడాలు ఉన్నాయి. డిసెంబర్ 2022 నాటికి ఈ రంగంలో సుమారుగా 18.39 కోట్ల పని దినాలు కల్పించబడ్డాయి. అంతేగాక 98 శాతం చెల్లింపులు 15 రోజులలోపు చేయబడ్డాయి.

55. ఉచితంగా బోరు బావులు త్రవ్వి పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ, తద్వారా సాగు యోగ్యమైన భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని పెంచేవిధంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సన్న, చిన్నకారు రైతుల కోసం వై.ఎస్.ఆర్. జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28, 2020 న ప్రారంభించారు. ఇప్పటి వరకు 17,047 బోరు బావులు త్రవ్వడం జరిగింది.

56. మా ప్రభుత్వం కుళాయి కనెక్షన్ల ద్వారా సుమారు 65 లక్షల ఇళ్లకు సురక్షిత మంచినీటిని అందించింది. జగనన్న కొత్త హౌసింగ్ కాలనీలతో సహా 2024 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు వీటి క్రిందకు తీసుకురాబడతాయి.

57. మా ప్రభుత్వం 250 మరియు అంతకంటే ఎక్కువ జనాభా ఉండి రహదారుల అనుసంధానం లేని అన్ని నివాసాలకు అనుసంధానించడానికి 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి

20