పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు

29. గ్రామ సచివాలయాల విస్తరణలో భాగంగా మన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ముందుగా పరీక్షించిన నాణ్యమైన మూల వనరులను సరఫరా చేయడం ద్వారా రైతు భరోసా కేంద్రాలు రైతులకు వివిధ సేవలను అందిస్తున్నాయి. అంతే కాకుండా ఇవి, 20 వేల రూపాయల వరకు నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతా తెరవడం, e-KYC ప్రక్రియను పూర్తి చేయడం, నగదు బదిలీల వంటి బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు, గ్రామ స్థాయిలో కొనుగోలు కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైతు భరోసా కేంద్రాల కోసం 18 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వ్యవసాయ మార్కెటింగ్ మరియు ధరల స్థిరీకరణ నిధి

30. రైతులకు మద్దతు ధర అందించడంలో మార్కెటింగ్ శాఖకు కలిగే నష్టాలను పూడ్చేందుకు 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో విస్తృతంగా పండించే మిరపకాయలు, పసుపు, ఉల్లి, చిన్న మినుములు, అరటి, బత్తాయి వంటి మరో ఆరు రకాల పంటలకు మన ప్రభుత్వం కనీస మద్దతు ధరని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్ లో 1500 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. వ్యవసాయ పరీక్షా కేంద్రాలు

31. రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుల మందుల కొరతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, జూలై 8, 2021 న మొదటి దశలో 70 వ్యవసాయ పరీక్షా కేంద్రాలను స్థాపించడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాలు రైతులకు మంచి నాణ్యమైన మూలవనరులను పొందడంలో సహాయపడుతున్నాయి. అలాగే, ఇవి పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి దోహదపడుతున్నాయి. మిగిలిన 177 పరీక్షా కేంద్రాలు నియోజకవర్గ స్థాయిలో 2022 ఖరీఫ్ కాలం నుండి పనిచేస్తాయి. వై.ఎస్.ఆర్. వ్యవసాయ పరీక్షా కేంద్రాల కోసం 2022-23లో 50 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను.

వ్యవసాయ యాంత్రీకరణ

32. మన ప్రభుత్వం ప్రతి వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రం వద్ద 10, 750 వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను (CHC) ఏర్పాటు చేయడం ద్వారా, చిన్న మరియు సన్నకారు రైతులకు ఎటువంటి పెట్టుబడి మరియు నిర్వహణ భారం

9