పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందించబడే 6,000 రూపాయలకు అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుండి రైతుల బ్యాంకు ఖాతాలకు 7,500 రూపాయలు జమ చేయబడుతున్నాయి. అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలవారికి చెందిన ఒక లక్షా 67 వేల భూమిలేని కౌలుదారుల మరియు అటవీ హక్కుల గుర్తింపు చట్టం క్రిందకు వచ్చే (ROFR) కుటుంబాలకు 13,500 రూపాయల చొప్పున రాష్ట్ర బడ్జెట్ నుండి ప్రత్యేక బడ్జెట్ అందించబడింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ, సకాలంలో ఆర్థిక సహాయం విడుదల చేయడం వలన రైతులు వ్యవసాయ కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించడం జరిగింది. 52.40 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు డాక్టర్ వై.ఎస్.ఆర్. రైతు భరోసా-ప్రధాన మంత్రి కిసాన్ యోజన కోసం 2022-23 సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. ఉచిత పంట బీమా

27. మన ప్రభుత్వం 'ఇ-పంట నమోదు' అనగా ఇ-క్రాప్ రిజిస్ట్రేషన్ ఆధారంగా వై.ఎస్.ఆర్. ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఫలితంగా, ఇ-క్రాప్ కింద నమోదు చేసుకున్న రైతులందరూ స్వయంగా ఉచిత పంట బీమా పథకం క్రిందకు వస్తారు. నీతి ఆయోగ్ మన కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరించదగిన ఆదర్శ నమూనా కార్యక్రమంగా గుర్తించింది. 2019 ఖరీఫ్ సీజనులో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 29.05 లక్షల మంది రైతులకు 3,707.02 కోట్ల రూపాయల బీమా క్లెయిమ్ లను, గత ప్రభుత్వ బకాయిలతో సహా చెల్లించడం జరిగింది. వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకం కోసం 2022-23 లో 1,802 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాలు

28. 2019-20 రబీ కాలంలో మరియు 2020-21 ఖరీఫ్ కాలంలో తీసుకున్న ఒక లక్ష రూపాయల వరకు ఉ న్న పంట రుణాల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరములో 12 లక్షల 30 వేల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు 207.72 కోట్ల రూపాయల వడ్డీ రాయితీలను మన ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలలోకే జమ చేయడం జరిగింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండీ, గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన బకాయిలతో సహా 65.01 లక్షల మంది రైతుల ఖాతాలలో 1,185 కోట్ల రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేయడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాల కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

8