పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చూపుతున్న తపన, రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి జీవితాన్ని మెరుగుపరిచే దిశగా కొనసాగుతుంది. ఈ క్రింది పంక్తులు మన గౌరవనీయ ముఖ్యమంత్రిగారి స్వభావాన్ని తెలియజేస్తాయి.

నిశ్చిత్వాయః ప్రక్రమతే నాన్తర్వసతి కర్మణాః!
అవస్థ్యకాలో వశ్యాత్మా సా వై పాండితాచ్యతే॥


ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే,

ఎవరైతే ఒక సంకల్పానికి ముందు దృఢ నిబద్ధతను కలిగి ఉంటారో,
ఎవరైతే అవిశ్రాంతంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారో, ఎవరైతే తమ విలువైన సమయాన్ని వృధా
చేయరో, ఆ వ్యక్తి
మనసు మీద నియంత్రణ కలిగి ఉంటారు.

2022-23 ఆర్థిక సంవత్సరంగాను ప్రతిపాదించిన బడ్జెట్ కేటాయింపులను సభ అనుమతికై సమర్పిస్తున్నాను.

వ్యవసాయం

25. వ్యవసాయం కేవలం ఆహార ఉత్పత్తి చేసే కార్యకలాపం మాత్రమే కాదు, మన జనాభాలో 62% మంది జీవనోపాధి భద్రతకు వెన్నెముక మరియు పర్యావరణంతో మానవుని అనుబంధానికి నిదర్శనంగా నిలిచి ఉంది. అందువలన ఇది మూడవ మరియు నాల్గవ మూల స్తంభాలకు మరియు ఎస్.డి.జి.ల సాకారానికి ముఖ్యమయినది. మన సమాజంలోని రైతుల ప్రధాన పాత్రను తెలియజేయడానికి మహా కవి శ్రీశ్రీ వ్యాఖ్యలలో...

“పొలాల నన్నీ,
హలాల దున్నీ
ఇలా తలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ" -- మహా కవి శ్రీశ్రీ

రైతే దేశానికి వెన్నెముక. ఈ కారణంగానే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి రైతు పక్షపాత ధోరణిని వారసత్వంగా మన ప్రభుత్వం కొనసాగిస్తుంది.

డాక్టర్ వై.ఎస్.ఆర్. రైతు భరోసా - పి.ఎం. కిసాన్ యోజన

26. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి, ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి ద్వారా 20,117.59 కోట్ల రూపాయలు రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలలో జమ చేయబడ్డాయి. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ పథకం ద్వారా

7