పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మానవ సామర్థ్య అభివృద్ధి

8. 'పేదరికం మరియు ఆకలి నిర్మూలన', 'మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును సాధించడం', 'నాణ్యమైన విద్య కలిగి ఉండడం మరియు లింగ సమానత్వాన్ని సాధించడం' అనే ఎస్.డి.జి.లను మొదటి అభివృద్ధి మూల స్తంభం అయిన 'మానవ సామర్థ్య అభివృద్ధి’ కలిగి ఉంటుంది.

9. విద్య మరియు ఆరోగ్యం మన ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రాధాన్యత. నాడు-నేడు వంటి మన ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ విద్య మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. జగనన్న అమ్మ ఒడి, గోరు ముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, మరియు వసతి దీవెన, వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ, వై.ఎస్.ఆర్. వైద్యశాలలు, వైద్య కళాశాలలు, ఆరోగ్యశ్రీ మరియు ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాలు, 'మానవ సామర్థ్యాల అభివృద్ధి' పై దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్ర మానవ వనరుల నాణ్యతను మెరుగుపరచడానికి మరియు అత్యున్నత నాణ్యతతో కూడిన విద్య, ఆరోగ్యం మరియు పోషకాహార సేవలను ప్రతి ఒక్కరికీ అందించడానికి ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి.

10. ఈ కార్యక్రమాల విజయం ద్వారా నీతి ఆయోగ్ యొక్క 'బహుళ పేదరిక నివేదిక (MPI) లో మన రాష్ట్రం ఉన్నత స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ యొక్క 2021 ఎస్.డి.జి.ల నివేదిక ప్రకారం పేదరికం తగ్గింపులో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా, మన రాష్ట్రంలో ఇప్పుడు శిశు మరియు కౌమార దశలోని పిల్లల మరణాలు 2% కంటే తక్కువగా ఉన్నాయి. బాలింతల ఆరోగ్య రక్షణలో రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. విద్యలో కూడా మనం పాఠశాల హాజరును 98% కంటే ఎక్కువగా సాధించాము. స్థూల నమోదు నిష్పత్తి (GER) రేటు కూడ షెడ్యూల్డ్ కులాల విషయంలో 7.5% గాను, షెడ్యూల్డ్ తెగల విషయంలో 9.5% గాను, బాలికల విషయంలో 11.03% గాను పెరిగి, జాతీయ పెరుగుదల రేటును అధిగమించింది.


మౌలిక సదుపాయాల అభివృద్ధి

11. స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం, సరసమైన మరియు స్వచ్ఛమైన ఎనర్జీ (శక్తి) ని అందుబాటులో ఉంచడం, స్థిరమైన నగరాలు మరియు సంఘాలను ప్రోత్సహించడం మరియు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లాంటి ఎస్.డి.జి.లు రెండవ మూలస్తంభమైన 'మౌలిక సదుపాయాల అభివృద్ధి క్రిందకే వస్తాయి.

12. నాడు-నేడు కార్యక్రమాలు, కొత్త వైద్య కళాశాలల కల్పన, వై.ఎస్.ఆర్. జలయజ్ఞం, వై.ఎస్.ఆర్. జల కళ, రహదారుల అభివృద్ధి, కొత్త ఓడరేవులు మరియు నౌకాశ్రయాల ఏర్పాటు, వ్యవసాయం మరియు పాడిపరిశ్రమలో మార్కెట్ మౌలిక సదుపాయాల కల్పన, ఫైబర్‌నెట్ మరియు పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా సమాజ

3