పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎస్.డి.జి. అయిన 'సరసమైన, స్వచ్ఛ విద్యుత్ శక్తి అందించడం'లో భాగంగా, మన రాష్ట్రంలో విద్యుదీకరించబడిన గృహాల శాతం 2014-15లో 92.5% గా ఉంటే, 2021-22 నాటికి 100% కి పెరిగింది.

107. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వినియోగించే శక్తిని లెక్కించడానికి మరియు నష్టాలను తగ్గించడానికి, అన్ని పంపిణీ ట్రాన్స్ ఫార్మర్లు మరియు ఫీడర్లకు మీటర్లు అందించబడతాయి. ప్రభుత్వం వ్యవసాయ ఫీడర్ విభజనను చేపట్టింది. దీనివలన అన్ని గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల నిరంతర 3-ఫేజ్ విద్యుత్ సరఫరాను ప్రభుత్వం అందిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

108. 2022-23 లో రైతులకు, ఆక్వా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ రాయితీతో సహా ఇంధన శాఖకు 10,281 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

గృహ మంత్రిత్వం

109. పోలీసు శాఖను ఆధునీకరించే చర్యలలో భాగంగా, మన ప్రభుత్వం మెరుగైన సాంకేతికత, వాహనాలతోపాటు, నిఘా వ్యవస్థ కోసం, నేర నిర్థారణ నైపుణ్యాల అభివృద్ధి కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. 'దిశ చట్టం' క్రింద మహిళా భద్రతలో భాగంగా, మహిళల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం అనేక చర్యలు తీసుకోబడుతున్నాయి. 2021 సంవత్సరానికి గానూ లైంగిక నేరాల ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ వ్యవస్థలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. విచారణ సమ్మతి రేటు అంటే లైంగిక నేరాలలో 60 రోజులలోపు పూర్తయిన దర్యాప్తు రేటు మన రాష్ట్రంలో 92.27% ఉంటే జాతీయ సగటు రేటు 40% మాత్రమే. 2022-23 లో గృహ మంత్రిత్వ శాఖకు 7,586.84 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ

110. పారిశ్రామిక శిక్షణా సంస్థలు మరియు అప్రెంటిస్ షిప్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో సాంకేతికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరుల మరియు సామర్థ్యాన్ని పెంపొందించడంపై మన ప్రభుత్వం ఎంతో దృష్టి పెట్టింది. ఈ శిక్షణా విధానాన్ని నిర్వహించడం కోసం పారిశ్రామిక భాగస్వాములతో 44 అవగాహనా ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకున్నది. దీనిలో, విద్యార్థులు తమ కోర్సు వ్యవధిలోని సగం కాలాన్ని పరిశ్రమలో వృత్తి శిక్షణ పొందుతూ, నైపుణ్యాభివృద్ధి సాధించి, ఉపాధి కల్పన దిశగా అడుగు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమయిన పారిశ్రామిక విలువల పెంపుదల కొరకు నైపుణ్యాల అభివృద్ధి (హైవ్) ప్రాజెక్ట్ క్రింద 15 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఎంపిక చేయబడ్డాయి. ప్రతి పారిశ్రామిక శిక్షణా సంస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త కోర్సులను ప్రారంభించడం కోసం మరియు ఉపాధ్యాయుల శిక్షణ కోసం పనితీరు ఆధారిత గ్రాంట్లు అందచేయబడుతున్నాయి. రాయచోటి,

29