పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రోడ్డు రవాణా మరియు మౌలిక సదుపాయాలు

102. జిల్లా కేంద్ర కార్యాలయాల నుండి మండల కేంద్ర కార్యాలయాలకు మరియు వివిధ మండల కేంద్ర కార్యాలయాల మధ్య డబుల్ లేస్ కనెక్టివిటీని అందించడం కోసం 'ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ మరియు రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్' మరియు 'ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్ట్' అనే రెండు ప్రాజెక్ట్ ను 6,400 కోట్ల రూపాయల ప్రతిపాదనతో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయంతో చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కింద 2,522 కి.మీ మేర రోడ్ల విస్తరణ మరియు 464 వంతెనల నిర్మాణం మరియు పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రతిపాదించ బడ్డాయి. ఇప్పటికే మొదటి దశ పనులకు మన ప్రభుత్వం పరిపాలనా అనుమతులను ఇచ్చింది.

103. 2వ దశ పనుల కోసం 1,268 కి.మీ రోడ్ల అభివృద్ధి ప్రక్రియలో భాగంగా 3,386 కోట్ల రూపాయల మొత్తానికి పరిపాలనా అనుమతులు పురోగతిలో ఉన్నాయి. కేంద్ర రహదారి నిధి క్రింద 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ 15.8 కోట్ల రూపాయల వ్యయంతో 125 కి. మీ. జాతీయ రహదారి విస్తరణ పనులను చేపట్టడం జరిగింది. రాబోయే 2022-23 ఆర్థిక సంవత్సరంలో దీనిని 600 కి. మీ.కు పెంచడం మన ప్రభుత్వ లక్ష్యం. ఇందుకుగాను అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 8,268 కి.మీ. మేర రాష్ట్ర రహదారులు మరియు ప్రధాన జిల్లా రహదారుల పునరుద్ధరణకు మన ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతిని ఇవ్వడం జరిగింది.

104. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా, రోడ్డు భద్రతా పటిష్టత కార్యక్రమంలో మన రాష్ట్రం పాల్గొంటోంది. ఇందులో పోలీసు, రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ మరియు ఆరోగ్య శాఖలకు ముఖ్య పాత్రను ఇస్తూ, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింపు లక్ష్యంగా స్పష్టమైన పనితీరు సూచికలతో కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాము.

105. 2022-23 లో రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ కోసం 8,581.25 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరపు కేటాయింపుల కంటే 13% ఎక్కువ.

ఇంధనం

106. దాదాపు 21 లక్షల మంది షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ రాయితీ అందించబడుతోంది. అంతే కాకుండా, ధోబీ ఘాట్లకు, దారిద్ర్యరేఖకు దిగువన ఉ న్న రజక సంఘాలకు, చాలా వెనుకబడిన కుల సంఘాలకు, చేనేత కార్మికులకు, క్షౌరశాలలకు, బంగారు కవరింగ్ యూనిట్లకు మరియు ఇమిటేషన్ జ్యువెలరీ యూనిట్లకు కూడా రాయితీ విద్యుత్ ను మా ప్రభుత్వం అందజేస్తున్నది. 7వ

28