పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

81. జగనన్న పల్లె వెలుగు ప్రాజెక్టు ద్వారా మెరుగైన వెలుతురు మరియు భద్రత కోసం మరియు శక్తి సామర్థ్యాన్ని నిర్ధారించడానికి కేంద్రీకృత నియంత్రణ మరియు నిర్వహణ వ్యవస్థ (CCMS) కు సంబంధించిన జంక్షన్ బాక్స్ ద్వారా అనుసంధానించబడిన 25.23 లక్షల ఎల్.ఈ.డీ. వీధి లైట్లను సంప్రదాయ వీధి లైట్ల స్థానంలో తిరిగి అమర్చడం ద్వారా 10,912 గ్రామ పంచాయితీలలో ఉన్న వీధి లైట్లు స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్ లకు మార్చబడ్డాయి.

82. 2021-22 లో, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 2,176 లక్షల పనిదినాలు కల్పించబడ్డాయి. ఈ పథకం క్రింద ఉపాధిని కోరిన వ్యక్తుల శాతంలో, ఉపాధిని పొందిన వ్యక్తుల శాతం 2019-20 లో 91.28% ఉండగా ఇది 2021-22 నాటికి 98% నికి పెరిగింది. 15 రోజులలోనే 99.41% చెల్లింపులు జరగడం గమనించదగిన విషయం. 2022-23 లో, ఈ పథకం క్రింద మూడు వేల లక్షల పని దినాలను కల్పించాలని మన ప్రభుత్వం భావిస్తోంది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 5,000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

83. ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్ మరియు నాబార్డ్ మద్దతు ఉన్న ప్రాజెక్ట్ అమలు ద్వారా మన ప్రభుత్వం అన్ని గ్రామీణ మరియు రోడ్డు అనుసంధానం లేని నివాస ప్రాంతాలకు అన్ని కాలాలను తట్టుకొనే BT మరియు CC రోడ్ కనెక్టివిటీని అందిస్తోంది మరియు గ్రామీణ రోడ్లను ఆధునీకరణ చేస్తోంది. 2021-22 లో 2,100 కి.మీ కంటే ఎక్కువ గ్రామీణ రోడ్లు ఈ ప్రాజెక్టుల క్రింద నిర్మించబడ్డాయి మరియు ఆధునీకరణ చేయబడ్డాయి.

84. ఒత్తిడితో కూడిన మరియు నాణ్యత లోపించిన 1249 నివాస ప్రాంతాలకు మంచినీటిని అందుబాటులోనికి తీసుకొని రావడానికి మన ప్రభుత్వం 3 త్రాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేసింది. చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు కృష్ణా జిల్లాలలోని ఒత్తిడితో కూడిన మరియు నాణ్యత లోపించిన నివాస ప్రాంతాలకు కూడా నాణ్యమైన నీటిని అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుంది.

85. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రామీణాభివృద్ధికి 15,846.43 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

పట్టణ అభివృద్ధి

86. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు సేవా స్థాయిలను మెరుగుపరచడం ద్వారా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు రక్షిత మంచినీటిని అందించడానికి మన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 86,356 మంచినీటి కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. 11వ ఎస్.డి.జి. అయిన

23