పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇళ్లకు 28,084 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ మొదటి దశలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. వీటిలో వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీలలో 11.44 లక్షల ఇళ్లు, సొంత స్థలాలలో మరో 4.16 లక్షల ఇళ్లు ఉన్నాయి. 15.6 లక్షల ఇళ్లలో, 10.88 లక్షల ఇళ్లు పునాది దశలో ఉండగా, 2.5 లక్షల ఇళ్లు కట్టుబడి దశలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్, మ్యాపింగ్ కు సంబంధించిన ప్రాథమిక కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. జియో ట్యాగింగ్ చివరి దశలో ఉంది. లబ్దిదారులకు మన ప్రభుత్వం 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందజేస్తుంది. అదనంగా 3 శాతం వడ్డీ రేటుతో ఆర్థిక సంస్థల ద్వారా అదనంగా 35,000 రూపాయలను లబ్ధిదారులకు అందించబడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. 15.6 లక్షల గృహాల కొరకు మొదటి దశ నిర్మాణంలో 21.7 కోట్ల పనిదినాలు సృష్టించబడ్డాయని అంచనా వేయడం జరిగింది. ఇప్పటి వరకు భవన నిర్మాణ ఖర్చుతో సహా లబ్దిదారులకు 1,146.7 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. 2022-23 లో పేదలందరికి ఇళ్ల కోసం 4,791.69 కోట్ల రూపాయల కేటాయింపును గృహనిర్మాణ శాఖ కు ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం

79. గృహనిర్మాణ శాఖ ద్వారా రుణాలు పొంది 2011 కి ముందు ఇళ్లు నిర్మించుకున్న లేదా ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల రుణాల మాఫీ కోసం మన ప్రభుత్వం 'వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని అమలు చేసింది. లబ్ధిదారులకు స్పష్టమైన టైటిల్ మరియు స్వాధీనపు హక్కుతో కూడిన పత్రాలను విడుదల చేయడం జరుగుతున్నది. ఇప్పటివరకు 8.56 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందారని ఈ గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

గ్రామీణాభివృద్ధి

“భారత దేశపు ఆత్మ గ్రామాలలో ఉంది” - మహాత్మా గాంధీ

80. స్వచ్ఛమైన మరియు ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని సృష్టించాలనే దృఢ సంకల్పంతో మన ప్రభుత్వం గ్రామీణ పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 'జగనన్న స్వచ్ఛ సంకల్పం - క్లీన్ ఆంధ్రప్రదేశ్' (CLAP) కార్యక్రమాన్ని - అక్టోబర్ 2, 2021న 'చెత్త రహిత-వ్యర్థ పదార్థాలు లేని దృశ్యపరంగా పరిశుభ్రమైన గ్రామాలను సాధించే లక్ష్యంతో 100 రోజుల పారిశుధ్య ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లో స్థిరమైన పారిశుధ్య పద్ధతులను పాటిస్తూ, గృహ వ్యర్థాలను సేకరిస్తూ, వాటిని వేరు చేస్తూ మరియు ప్రాసెసింగ్ చేస్తున్న 34,773 క్లాప్ మిత్రాలతో కూడిన 10,718 సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కేంద్రాలు ఉన్నాయి.

22