పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన

75. ఉన్నత విద్యలో (18-23 సంవత్సరాలు) 2019-20 లో 32.4% ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (GER) 2021-22 లో 53.89% పెరిగింది. వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అందిస్తున్న మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ మరియు నిర్వహణ రుసుము స్థూల నమోదు నిష్పత్తిలోని ఈ పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న మొత్తం విద్యార్థులలో, 87% మందికి వారు కట్టిన ఫీజు 4,500 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. 2022-23 లో జగనన్న విద్యా దీవెనకు, 2,500 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెనకు 2,083.32 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

76. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారికి ఉన్నత విద్యా అవకాశాలను మెరుగుపరచడానికి రాష్ట్రంలోని ఆశావహ జిల్లాలలో కొత్త మోడల్ డిగ్రీ కళాశాలలు స్థాపించబడుతున్నాయి. గిరిజన ప్రాంతంలోని బాలికలకు ఉన్నత విద్యనందించేందుకు అరకులో నూతన మోడల్ డిగ్రీ కళాశాలను నిర్మిస్తున్నాము.

77. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఉన్నత విద్య కోసం 2,014.30 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఈ కేటాయింపు జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాల క్రింద సంక్షేమ కార్పోరేషన్లకు కేటాయించిన మొత్తానికి అదనం.

గృహ నిర్మాణం

“పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టివిడుట కన్న పరగ చచ్చుట మేలు
విశ్వదాభిరామ వినురవేమ! -యోగి వేమన

అంటే అసాధ్యమైన పనికి సాధారణంగా పూనుకోకూడదు. ఒక వేళ పూనుకుంటే, ఎన్ని కష్టనష్టాలొచ్చినా మధ్యలో వదలక ఆ కార్యాన్ని నెరవేర్చాలి.

78. 2023 నాటికి రాష్ట్రంలోని అన్ని అర్హత కలిగిన కుటుంబాలకు సంతృప్త స్థాయిలో శాశ్వత గృహాలను అందించడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. రెండు దశలలో 28.3 లక్షల ఇళ్లను నిర్మించనున్నాము. 15.6 లక్షల

21