పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంక్షేమం

55. మా నాల్గవ మూల స్తంభంలో పురోగతిని నమోదు చేయడానికి బలమైన సామాజిక భద్రతా వలయాన్ని నిర్మించడం అత్యవసరం. పేద, వెనుకబడిన మరియు బలహీన వర్గాల అవసరాలు మరియు ప్రాధాన్యతలను సమగ్ర వ్యూహంతో పరిష్కరించాలని ఇది పిలుపునిచ్చింది. నవరత్నాల క్రింద వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అల్ప సంఖ్యాక వర్గాల వారు మరియు సమాజంలోని ఇతర బలహీన వర్గాల వారి అభివృద్ధికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్య, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, జీవనోపాధి, నైపుణ్యం మరియు స్వయం ఉపాధి కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా గణించదగిన లక్ష్యాలను సాధించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

వై.ఎస్.ఆర్. పింఛన్ కానుక

56. సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకు, ముఖ్యంగా వృద్ధులు మరియు బలహీనులు, వితంతువులు మరియు వికలాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు మన ప్రభుత్వం సహాయం చేస్తోంది. వై.ఎస్.ఆర్. పింఛను కానుక క్రింద 61.74 లక్షల మంది పింఛనుదారులకు ప్రభుత్వం ప్రతినెలా పింఛన్లు అందజేస్తోంది. మన ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా, వృద్ధాప్య పింఛనుదారులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు మరియు A.R.T. చికిత్స పొందే HIV పింఛనుదారుల పింఛను మొత్తాన్ని 2,250 రూపాయల నుండి 2,500 రూపాయలకి పెంచింది. ఈ పెంపుదల డిసెంబర్ 2021 నుండే అమలులోనికి వచ్చింది. 2022-23 సంవత్సరానికి వై.ఎస్.ఆర్. పింఛను కానుక పథకం కోసం 18,000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. బీమా

57. తమ కుటుంబ పెద్దను దురదృష్టవశాత్తు కోల్పోయే పేద కుటుంబాలను ఆదుకోవడానికి, మన ప్రభుత్వం వై.ఎస్.ఆర్. బీమా పథకం క్రింద 1.32 కోట్ల పేద కుటుంబాలకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తోంది. మన ప్రభుత్వం బ్యాంకుల ప్రమేయం లేకుండా జూలై 1, 2021 నుండి సొంత నిధులతో ఈ పథకం అమలును కొనసాగిస్తోంది. 2022-23 సంవత్సరానికి 372.12 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. వాహన మిత్ర

58. బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు మరియు ఇతర అవసరాల నిమిత్తం, సొంత యజమానులైన ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వై.ఎస్.ఆర్. వాహన మిత్ర మన

16