పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వై.ఎస్.ఆర్. కంటి వెలుగు కార్యక్రమం

43. రాష్ట్రంలోని మొత్తం 5.6 కోట్ల జనాభాకు దశలవారీగా ఉచితంగా సమగ్ర నాణ్యమైన కంటి సంరక్షణా సేవలను అందించడానికి మన ప్రభుత్వం 'వై.ఎస్.ఆర్. కంటి వెలుగు' అనే సామూహిక కంటి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1వ మరియు 2వ దశలలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలలోని విద్యార్థుల కంటి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆగస్టు 16, 2021 న 3వ దశలో “అవ్వ-తాత' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు కంటి పరీక్షలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నది. ఇప్పటి వరకు 16,64,919 మందికి కంటి పరీక్షల నిర్వహణ, 8,50,364 మందికి కళ్లద్దాలు అందజేత మరియు 1,55,473 మందికి కంటి శుక్లం శస్త్రచికిత్సలు చేయడం జరిగింది.

44. ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 15,384.26 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది 2021-22 సంవత్సర కేటాయింపుల కన్న 11.23% ఎక్కువ.

బాలల సంక్షేమం

“ఈ రోజు ప్రతి బిడ్డకు జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు,
ఆరోగ్య హక్కు, విద్య హక్కు, భద్రత హక్కు, గౌరవ హక్కు,
సమానత్వం మరియు శాంతి హక్కు కలిగి ఉండవలసిన సమయం ఇది.” - కైలాష్ సత్యార్థి


45. పోషకాహార నాణ్యతను పెంపొందించే దిశగా మన ప్రభుత్వం 77 గిరిజన ఉప ప్రణాళికా మండలాలలో వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ ప్లస్ ను, అదే విధంగా మైదాన ప్రాంతాలలో వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణను అమలు చేస్తోంది. ఈ పథకాల క్రింద అందించబడే గుడ్డు మరియు పాలు; గర్భిణీ స్త్రీలలో మరియు పాలిచ్చే తల్లులలోని రక్తహీనతను మరియు పిల్లలలోని పోషకాహార లోపాన్ని తగ్గించడానికి అవసరమైన ఐరన్, ప్రోటీన్లు మరియు ఖనిజ లవణాలను అందజేస్తాయి. ఈ సంపూర్ణ అనుబంధ పోషకాహార కార్యక్రమం ద్వారా, మొత్తం 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు, 6 నుండి 36 నెలల మధ్య వయస్సు గల 16 లక్షల మంది పిల్లలు మరియు 36-72 నెలల వయస్సు గల 13 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. మన ప్రభుత్వం ఈ పథకాలపై కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల కంటే 1,560 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చింది.

46. 3వ ఎస్.డి.జి. అయిన 'మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు' పై పురోగతికి సంబంధించి, 9 నుండి 11 నెలల మధ్య వయస్సు గల పిల్లలలో పూర్తి స్థాయి రోగ నిరోధక శక్తిని పొందే వారి శాతం 2014-15 లో 67% గా

13