పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన ప్రభుత్వం 35 సమీకృత ఆక్వా ప్రయోగశాలను ఏర్పాటు చేస్తోంది. అదనంగా, సముద్రంలోని లోతైన ప్రదేశాలలో చేపల వేటను ప్రోత్సహించడానికి మరియు సురక్షితమైన బెర్తింగ్ సౌకర్యాలను అందించడానికి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 8 చేపల వేట హార్బర్ నిర్మాణాన్ని మన ప్రభుత్వం చేపట్టింది. 2022-23 లో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖకు 1,568.83 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

ప్రజా పంపిణీ వ్యవస్థ

36. మన ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) క్రింద పౌరుల ఇంటి వద్దకే అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తోంది. 1.5 కోట్ల మంది రేషన్ కార్డ్ లబ్దిదారులందరికీ పారదర్శకమయిన, తిరిగి వేలం వేసే ప్రక్రియ ద్వారా కొనుగొలుచేయబడిన 9,260 సంచార పంపిణీ యూనిట్ల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన యువత ఈ సంచార పంపిణీ యూనిట్లను నిర్వహిస్తున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద 'స్వర్ణ' మరియు 'సార్టెక్స్' రకాలకు చెందిన నాణ్యమైన బియ్యాన్ని అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది.

ఆరోగ్యం మరియు పోషకాహారం

“తిండి కలిగితే కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్” - మహాకవి గురజాడ అప్పారావు

37. మొదటి స్తంభమైన బలమైన 'మానవ సామర్థ్య అభివృద్ధి’ని సాధించడంలో మంచి ఆరోగ్య వ్యవస్థ కలిగిన సమాజం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. నీతి ఆయోగ్ వైద్య సూచిక 2021 నివేదికలో రెండేళ్ళ క్రితం 4వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం, నేడు దేశంలోనే 2వ స్థానానికి ఎదగడం ద్వారా మా ప్రభుత్వం యొక్క విశేష కృషి ప్రతిబింబించబడిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. నెట్ వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 919 నుండి 1,757కి పెంచడం, చికిత్సలను 1059 నుండి 2,446 కి పెంచడం ద్వారా, మరియు ఒక్కో కుటుంబానికి ఆదాయ పరిమితిని ఏడాదికి 5 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి 2019 లో వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించారు. 1,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చయ్యే అన్ని చికిత్సలు ఈ పథకం క్రిందకు చేర్చబడ్డాయి. QR కోడ్ తో కూడిన దాదాపు 1.4 కోట్ల వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కాలు పంపిణీ చేయబడ్డాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4వ విడత నివేదిక ప్రకారం 2019-20 లో 74.6% గా ఉన్న ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి వచ్చే కుటుంబాల శాతం 2021-22 నాటికి 91.27%కి పెరిగింది.

11