పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8,727 కోట్ల 8 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 7.2% ఎక్కువ.

అడవులు-పర్యావరణం

67. అభివృద్ధి చెందుతున్న జీవవైవిధ్యం కోసం మరియు పౌరులకు స్థిరమైన జీవన స్థలాన్ని సృష్టించడం కోసం, హరితాంధ్ర ప్రణాళిక దిశగా ప్రభుత్వం అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించదలచింది. ఇది భారీ కార్బన్ సింక్ గా కూడా పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రిగారు 2020 జూలై 22న, 71వ వనమహోత్సవమును ప్రారంభించారు. ద్వారా, 13వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'వాతావరణ మార్పులను మరియు దాని ప్రభావాలను ఎదుర్కోవడానికి అత్యవసర చర్యలు తీసుకోవడం' మరియు 15వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'భూసంబంధ పర్యావరణ వ్యవస్థల యొక్క స్థిరమైన వినియోగాన్ని రక్షించడం, పునరుద్ధరించడం మరియు ప్రోత్సహించడం, అడవులను స్థిరంగా నిర్వహించడం, ఎడారీకరణను ఎదుర్కోవడం మరియు భూసార క్షీణతను ఆపడమేకాక యథాస్థితికి తీసుకురావడం మరియు జీవవైవిధ్య నష్టాన్ని ఆపడం'లో భాగంగా జగనన్న పచ్చతోరణ కార్యక్రమం క్రింద 9.5 కోట్ల విత్తనాలను నాటడం జరిగింది. 2021-22 సం॥లో పర్యావరణ, అటవీ, విజ్ఞాన, సాంకేతిక విభాగానికి 806 కోట్ల 47 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

సాగునీటి వనరులు

నీటికి సమస్యలను పరిష్కరించగలిగినవారు ఎవరైనా రెండు రకాల నోబెల్ బహుమతులకు అర్హులు: ఒకటి శాంతికి, రెండవది విజ్ఞాన శాస్త్రానికి.

-జాన్ ఎఫ్ కెనడి

33