పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68. ప్రభుత్వం 54 జలయజ్ఞం ప్రాజెక్టులను చేపట్టగా, వాటిలో 14 పూర్తయ్యాయి. మిగిలిన 40 ప్రాజెక్టులు పూర్తయిన తరువాత, పెద్ద మరియు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల క్రింద 27 కోట్ల 62 లక్షల ఎకరాల కొత్త నీటిపారుదల సామర్థ్యం కల్పించబడటమేకాక 5 కోట్ల 3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టులో, 66.86% హెడ్ వర్కులు, 91.69% కుడి ప్రధాన కాలువ మరియు 69.96% ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయని మరియు పనులు వేగంగా జరుగుతున్నాయని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

69. శ్రీకాకుళం జిల్లాలోని 9 మండలాలలో, 45,000 ఎకరాల విస్తీర్ణంలో నీటి పారుదల సామర్థ్యాన్ని సృష్టించే బొడ్డేపల్లి రాజగోపాల్ రావు వంశధార ప్రాజెక్టు 86% పూర్తయింది. ఇది 2021 జూలై నాటికి పూర్తవుతుందని అంచనా వేయబడింది. వంశధార మరియు నాగవాళి నదుల అనుసంధానం; మహేంద్రతనయ నదిపై ఆఫ్-షోర్ రిజర్వాయర్; సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ మరియు గజపతినగరం బ్రాంచ్ కాలువ; శ్రీ గొర్లె శ్రీరాములు నాయుడు మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ 2వ దశ; పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ దశ, కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్, నెల్లూరు మరియు సంగం ఆనకట్టలు; గండికోట-చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్టులు; హంద్రీ-నీవ సుజల స్రవంతి ప్రాజెక్ట్; శ్రీ కృష్ణ దేవరాయ గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొదలగునవి మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర ప్రధాన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అధిక శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు 2021-22 సం॥లో పూర్తవుతాయని తెలియచేస్తున్నాను.

70. మన ప్రభుత్వం జలయజ్ఞం క్రింద నీటిపారుదలకొరకు నీటి లభ్యతను మెరుగుపర్చడం ద్వారా 9వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'స్థితిస్థాపకతతో కూడిన మౌళిక సదుపాయాల కల్పన, సమగ్ర మరియు స్థిరమైన పారిశ్రామీకరణను మరియు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం' మరియు 2వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'ఆకలిని

34