పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63. 2021-22 సం॥లో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 18,580 కోట్ల 70 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 11. 19% ఎక్కువ.

పట్టణాభివృద్ధి

64. ఆసియా మౌళిక పెట్టుబడుల బ్యాంకు (A.I.I.B) అందిస్తున్న సహాయంలో భాగంగా రూ. 5,000 కోట్ల వ్యయంతో, పట్టణ స్థానిక సంస్థలలోని 3.3 మిలియన్ల పట్టణ జనాభాకు త్రాగునీరు అందించడానికి, ఆంధ్రప్రదేశ్ పట్టణ నీటి సరఫరా ప్రాజెక్టును మా ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా, జాతీయ సేవా స్థాయి ప్రమాణాలు ప్రకారం నీటి సరఫరా, పారిశుధ్యం, వరద నీటి నివారణ కాలువలు, రహదారులు, ఉద్యానవనాలు మొదలైన మౌళిక సదుపాయాల సేవలను అందించడానికి మరియు పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, 110 పట్టణ-స్థాయి సంస్థలలో 'క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్' (C.I.I.P.) అమలు చేయడం జరుగుతుంది.

65. 120 పట్టణ స్థానిక సంస్థలలో 560 వై.యస్.ఆర్. పట్టణ వైద్య కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టింది. 'అమృత్ పథకం' క్రింద వివిధ పట్టణ స్థానిక సంస్థలలో రెండు దశలలో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ మరియు వరద నీటి నివారణ కాలువల నిర్మాణం వంటి వివిధ పనులను చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులన్నియు 2021 డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని అంచనా.

66. మన ప్రభుత్వం పట్టణాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 6వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అందరికి పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం' మరియు 11వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'నగరాలు మరియు మానవ ఆవాసాలను సురక్షితంగా, సుస్థిరంగా సమగ్రంగా రూపొందించుట'ను సాధించే దిశగా ముందుకు వెళ్తోంది. అన్ని పట్టణ స్థానిక సంస్థలలో మౌళిక సదుపాయాలు మరియు సేవలు ఏర్పాటు చేయడంవలన పట్టణ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. 2021-22 సం॥లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు

32