పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్య రంగం

23. దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో మన రాష్ట్రం 46.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. భారత దేశం మొత్తం ఉత్పత్తిలో మన రాష్ట్రం వాటా 29.4% గా ఉంది. దేశంలోని మొత్తం రొయ్యల సాగులో మన రాష్ట్రం 5.12 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 68.5% గా ఉంది. 2019-20లో దేశం నుండి 46, 663 కోట్ల రూపాయల విలువగల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతులు జరుగగా అందులో రాష్ట్ర వాటా 18,846 కోట్ల రూపాయలు (40.4%) గా వున్నది. మత్స్య రంగం 26.50 లక్షల జనాభాకు జీవనోపాధి కల్పిస్తున్నది.

24. మత్స్యకారుల సంక్షేమం కోసం వై.యస్.ఆర్. 'మత్స్యకార భరోసా పథకాన్ని’ ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వం జూన్ 2019 నుండి, చేపల వేట నిషేధ కాలంలో 1,19,875 లబ్దిదారులకు రూ. 332 కోట్లు, 19,796 మంది లబ్దిదారులకు డీజిల్ ఆయిల్ పై రూ.48.17 కోట్ల సబ్సిడీ, మరణించిన 67 మత్స్యకారుల కుటుంబాలకు రూ. 6.7 కోట్లు మెరుగైన ఎక్స్- గ్రేషియాను ఇవ్వడం జరిగింది. 53,550 రొయ్యల పెంపకం రైతులకు విద్యుత్ సుంకం యూనిట్‌కు రూ.3.86 నుండి రూ.1.50కు తగ్గించబడింది. ఫలితంగా రూ.1,560 కోట్లు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

ఇంతేగాక G.S.P.C. తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 14,927 కుటుంబాలకు, పరిహారంగా రూ.75 కోట్లు అందించడం జరిగింది. తీరప్రాంత మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి మరియు వలసలను తగ్గించడానికి, 8 ఫిషింగ్ నౌకాశ్రయాల అభివృద్ధిని రెండు దశలలో చేపట్టడం జరిగింది. రూ.1510 కోట్లతో 4 ఫిషింగ్ నౌకాశ్రయాల నిర్మాణ పనులు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం,

12