పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ ప్రాజెక్టు లక్ష్యం. అంతేగాక 27 లక్షల మంది మహిళా రైతులను భాగస్వామ్యం చేయడం మరియు రోజుకు 2 కోట్ల లీటర్ల పాలను సేకరించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. 9,899 మహిళా పాల సహకార సంఘాల నిర్వహణలో బాధ్యతను పంచుకొనడం మరియు తగిన ధరతోపాటు ఆర్థిక అభివృద్ధిని అందుకొనడమే లక్ష్యంగా, వారికి పాల నాణ్యత మరియు పారదర్శకతను నిర్ధారించే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ (AMCU) మరియు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (BMCU) లను కలిగి యున్న భవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విప్లవం ఇప్పటికే 700 గ్రామాల్లో ప్రారంభమైంది మరియు మహిళా పాల ఉత్పత్తిదారులు, రైతులు లీటరు పాలకు రూ. 5 నుంచి రూ.17 వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.

జగనన్న జీవక్రాంతి

21. రాష్ట్ర వ్యాప్తంగా 2,49,151 గొర్రెల/మేకల యూనిట్ల పంపిణీ కోసం రూ.1,869 కోట్లతో జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం యొక్క లబ్దిదారులకు వై.యస్.ఆర్. చేయూత క్రింద పశువుల సేకరణ, రవాణా మరియు బీమా ప్రీమియం కోసమై 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడుతున్నది.

22. పశువుల రంగం నిరంతరమైన మరియు ఆటంకంలేని ఆదాయాన్ని సృష్టిస్తుంది మరియు వ్యవసాయ సంబంధిత పేద వర్గానికి జీవనోపాధిని అందిస్తూంది కూడా. వై.యస్.ఆర్. పశువుల నష్టపరిహార పథకం ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమంగా కొనసాగుతుంది. ఈ పథకం ప్రకారం మేలురకం స్వదేశీ జాతి పశువు ఒకదానికి రూ.30,000 లు చొప్పున, సాధారణ జాతి గేదెలు మొదలైన పశుసంపదకు ఒకదానికి రూ.15,000 లు చొప్పున మరియు ఒక్కొక్క గొర్రె లేదా మేకకు రూ. 6,000లు చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించబడుతుంది. పశువుల నష్ట పరిహార నిధి కోసమై 2021-22 సంవత్సరానికి 50 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

11