పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వద్ద ప్రారంభమయ్యాయి. రెండవ దశలో, రూ. 1365.35 కోట్లతో మరియొక 4 ఫిషింగ్ నౌకాశ్రయాలు-శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖపట్నంలోని పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో రాబోతున్నాయి. ఈ చర్యలతో, 'మహాసముద్రాలు, సముద్రాలు మరియు సముద్ర వనరులను సుస్థిర అభివృద్ధికి పరిరక్షించడం మరియు స్థిరంగా ఉ పయోగించడం' అనే 14వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు అడుగు వేయడం జరిగింది అని చెప్పవచ్చును. 2021-22 సంవత్సరానికి మత్స్య రంగానికి రూ. 329.48 కోట్లు ప్రతి పాదిస్తున్నాను.

25. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు కేటాయింపుల ద్వారా నాలుగు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (S.D.G) సాధించగలుగుతున్నాము - అవి ఏమనగా 1వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అన్నిరకాల రూపాలలో పేదరిక నిర్మూలన', 2వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'ఆకలి బాధలు లేకుండా చూడటం', 8వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన 'నిరంతర, సమగ్ర మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడం మరియు ఉత్పాదకతో కూడిన ఉపాధి మరియు అందరికీ గౌరవప్రదమైన పని కల్పించడం' మరియు 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'అసమానతలు తగ్గించడం'.

ప్రజాపంపిణీ వ్యవస్థ

26. 2021 జనవరి 21న మన ప్రభుత్వం, 9,260 సంచార పంపిణీ యూనిట్ల (M.D.U.) ద్వారా అర్హత గల లబ్దిదారులకు వారి గృహాల వద్దనే అవసరమైన నిత్యావసర వస్తువులను ప్రజాపంపిణీ వ్యవస్థ క్రింద పంపిణీ చేసే మునుపెన్నడూ లేని బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి నెలా చౌకధరల దుకాణాల నుండి నిత్యావసర సరుకులను (రేషన్) పొందడానికి బదులు ఇంటి వద్దనే నిత్యవసర సరుకులను (రేషన్)

13