పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అభివృద్ధి పరంగా ఏ స్థానంలో ఉంటుందనే విషయాన్ని నిర్ణయించడంలో అపారమైన బాధ్యత కూడా ఉంచుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో ఈ సంవత్సరం మనం 150వ జయంతి వేడుకలను జరుపకొనే మహాత్మాగాంధీ మాటలను మరోమారు మార్గదర్శకంగా తీసుకోవడమయింది.

“నేను మీకు ఒక తాయత్తు ఇస్తాను మీరు సందేహంలో ఉన్నపుడు లేదా మీరు ఇబ్బంది పరిస్థతులలో ఉన్నపుడు ఓ పరీక్షను అనుసరించండి. మీరు చూచిన నిరుపేద మరియు అత్యంత బలహీన వ్యక్తి ముఖాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు చేపట్టబోయే చర్య అతనికి ఏ విధంగానైనా ఉపయోగపడుతుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆయన దాని ద్వారా ఏదైనా పొందగలడా? ఆయన జీవితం మరియు విధి రాతపై అతని నియంత్రణను ఆ చర్య పునరుద్ధరిస్తుందా ? మరోవిధంగా చెప్పాలంటే ఆకలితో, ఆధ్యాత్మికతలేమితో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ చర్య విముక్తినిస్తుందా ? అపుడు మీ సందేహాలను తెలుసుకొంటే మీరంతట మీరే మారతారు”.

మహాత్మా గాంధీ

18. మహాత్మాగాంధీ మాటలను పునస్కరించుకొని 2022 నాటికి రాష్ట్రంలో లేమితనం లేకుండా చూడాలని భావిస్తున్నాను. అందువల్ల, సంపద కల్పన మరియు సంక్షేమ కార్యక్రమాల మధ్య అధిక కష్టతరమైన ప్రత్యామ్నాయాలను రూపొందిస్తూ, సంక్షేమం పట్ల ఆ రెండింటిని సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సింగపూర్ అంతర్జాతీయ విమానాలకు వయబులిటి గ్యాప్ ఫండింగ్ ను సమకూర్చాలా లేదా వేలాది మంది తల్లులు, పిల్లలకు ప్రత్యామ్నాయంగా మెరుగైన పోషకాహారాన్ని అందించాలా అనే విషయంలో మొదటి దానిని వదిలి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మా మనస్సాక్షి మరియు ఎంపికలు స్పష్టంగా ఉన్నాయి.

19. ప్రభుత్వం ఈ బడ్జెట్లో “'నవరత్నాలు పై ప్రత్యేక దృష్టితో మా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మేనిఫెస్టోను ఏ విధంగా రూపొందించాము అనే విషయాన్ని మర్చిపోము. గౌరవ ముఖ్యమంత్రి గారు 14 నెలల కాలంలో తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో సుమారు 2 కోట్ల మంది ప్రజలను ఎక్కువగా పేదలను వ్యక్తిగతంగా కలుసుకొని వారు భావించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల వాస్తవ అవసరాల వ్యక్తీకరణల సమ్మేళనంగా ఈ పత్రాన్ని రూపొందించడమయింది.

8