పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తన ఔత్సాహిక ప్రజలతో 2022 కు పరివర్తనం చెందడంలో ప్రముఖ రాష్ట్రాలలో ఒకటిగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉండేది. కేవలం కొంత స్పష్టత విభజన చట్టంలో లేకపోవడం వల్ల మన నాగరికత యొక్క ఘనమైన సాంప్రదాయాల ప్రకారం ఇవ్వబడిన హమీలు నిష్ప్రయోజనం కాకూడదు. ఇంతేగాక ఆంధ్రప్రదేశ్ కు హామీలను ఇచ్చిన తరువాత మాత్రమే పార్లమెంటు సభ్యులు ప్రతిపాదించిన సవరణలను వదిలి వేయడం జరిగింది.

14. అధ్యక్షా, భారతదేశ కుటుంబ వ్యవస్థ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా గౌరవించడం జరుగుతున్నది. మన గొప్ప దేశంలో, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో వెనకడుగు వేయరు. కాగా కొన్ని సందర్భాలలో ఈ నిజం మారిపోయింది. పార్లమెంటు మన రాష్ట్రానికి జన్మనిచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారం మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చిత్తశుద్ధితో కోరుతున్నాను.

15. పార్లమెంటుకు సాధికారతనిచ్చే భారత రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్‌ను పూర్తి వైవిధ్యత గల మన దేశ ప్రజల ఆకాంక్షలన్నింటికీ తగినంత ప్రాతినిధ్యం ఉండేలా చూడటానికి ప్రవేశపెట్టడమయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఖచ్చితంగా చివరి విభజన కాబోదు. మన ఘనమైన నాగరికత యొక్క సాంప్రదాయాలను మరియు ప్రజాస్వామ్య దేశంగా మన ఔన్నత్యాన్ని కాపాడేందుకు భవిష్యత్తు తరాలకు మంచి ఉదాహరణగా నిలిచేందుకుగాను, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను పార్లమెంటు మరియు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలి.

కఠినమైన ప్రత్యామ్నాయాలు

16. ముఖ్యమంత్రిగారు మరియు ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదాను సాధించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు. మనకున్న పరిమిత ఆదాయాలలోనే ఖర్చులు భరించాల్సి ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రాప్తించిన ద్రవ్య స్థితి వల్ల చాలా కఠినమైన ప్రత్యామ్నాయాలను చూసుకోవాల్సి వచ్చింది.

17. ఈ సందర్భంగా 2022లో భారతదేశ 75వ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకొనే అవకాశం ఈ ప్రభుత్వానికి దక్కడం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. దీనితోపాటు 2022 నాటికి మన రాష్ట్రం

7