పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రత్యేక కేటగిరీ హోదా

11. ఈ సందర్భంలో, ప్రత్యేక హోదా డిమాండు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి గౌరవ ప్రధాన మంత్రిగారితో జరిగిన వివిధ సమావేశాలలో మన ముఖ్యమంత్రిగారు గట్టిగా చెప్పారు. మొదటది, రాజధాని ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించడం ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే జరిగింది. రెండవది, ప్రత్యేక హోదా ఇస్తామని హమీ ఇచ్చిన తర్వాతనే 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఏదేని ఇతర విభజన సందర్భాలలో ఇలాంటి పరిస్థితి లేదు. మూడవది, రాష్ట్ర విభజన రాష్ట్ర ఆర్థిక వనరులను తీవ్రంగా దెబ్బతీసినందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే తన నియంత్రణలో లేని కారణాల వల్ల ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేస్తున్నది. విభజన తరువాత తెలంగాణ తలసరి రాబడి ఒక రూపాయి ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత తలసరి రాబడి వెంటనే సుమారు 60 పైసలుకు పడిపోయింది. అదే సమయంలో తలసరి రెవెన్యూ వ్యయం విభజన తరువాత సంవత్సరాలలో తెలంగాణాతో సమానంగా ఉన్నది. నాలుగవది, ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. అయితే, దీని అమలు పెండింగులో ఉంది.

12. అధ్యక్షా, ఒక దేశ గొప్పతనం దాని ప్రజలు, సహజ వనరులు మరియు లిఖితపూర్వక శాసనాల కంటే ఎక్కువనే విషయం మీకు తెలుసు. దేశంలో విలువలు, సాంప్రదాయాలు మరియు సిద్ధాంతాలు కూడా ఏదేని జాతిలో అంతర్ భాగంగా ఉంటాయి. మన భారతదేశ గొప్ప నాగరికతలో ఒక సాంప్రదాయం నాటుకుపోయింది. సమాజంలోని స్థానిక పెద్దలు, పిల్లల మధ్య పూర్వీకుల ఆస్తి విభజన సక్రమంగా జరిగేలా చూస్తారు. ఇదే స్ఫూర్తితో మన రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాలను విభజించే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు ఇతర అంశాల అమలుతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రిగారు హామీ ఇచ్చారు.

13. అందువలన, ఈ ప్రతిష్టాత్మక సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రిగారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే, ప్రజాస్వామ్యానికి అత్యున్నత సాధనమైన పార్లమెంటు న్యాయ స్పూర్తితో హమీ ఇవ్వడమే కాకుండా, తగినంత ప్రోత్సాహకం

6