పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. పారదర్శకత మా మూడవ సూత్రం. ఈ ప్రభుత్వం అన్ని కాంట్రాక్టు పనులలో పారదర్శకంగా ఉండటానికి కట్టుబడి ఉంది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉత్తర్వులు మాదిరిగా జిల్లా స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ చూడటం కోసం వారి ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో ఉంచాలని కలెక్టర్లందరిని మన గౌరవ ముఖ్యమంత్రిగారు ఇదివరకే ఆదేశించారు.

7. నాల్గవ సూత్రంగా మా నాయకుడు మునుపటి ప్రభుత్వం మాదిరిగా కాకుండా అవినీతిరహిత పరిపాలనను నిర్ణయాత్మకంగా ముందుకు తీసుకొచ్చారు. అన్ని స్థాయిలలో, అన్ని కార్యాలయాలలో రాష్ట్రాన్ని అవినీతిరహితంగా చేయాలని మంత్రులను అదేవిధంగా అధికారులందరినీ గౌరవ ముఖ్యమంత్రిగారు ఆదేశించారు. న్యాయ సంబద్ధతకు సంబంధం లేకుండా రాజకీయ నాయకులకు సహకరించాలనే మునుపటి ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా న్యాయపరమైన నియమాలకు లోబడి మాత్రమే రాజకీయ ప్రతినిధుల అభ్యర్థనలను పరిశీలించాలని మన గౌరవ ముఖ్యమంత్రిగారు అధికారులందరినీ కోరారు. సాధారణంగా పనులకు సంబంధించిన టెండర్స్ ఇవ్వడంలో అవినీతికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుతో కలుపుకొని సాగునీటి ప్రాజెక్టులు మరియు పని కాంట్రాక్టులలో అవినీతిని నిరోధించడానికి ఈ ప్రభుత్వం జూడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నది.

ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక స్థితి

8. మునుపటి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించామని చెప్పుకున్నప్పటికీ, తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, యువతకు ఉద్యోగాలు లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, పేదలకు సరైన సహాయం చేయకపోవడం మొదలైన వాటిని మేము గుర్తించాము. ప్రకటించుకున్న విధంగా మునుపటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర వాస్తవ అవసరాలను తీర్చలేదని ఇది వివరిస్తుంది, చెప్పిన విధంగా వృద్ధి జరగలేదు. అతిశయం, క్షేత్ర స్థాయిలో వాస్తవికత మధ్య స్పష్టమైన అంతరం ఉన్నది. గత ఐదు సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధి సాధించిందని మాకు తెలియచేసారు. ఈ వృద్ధి అంకెలు యదార్ధమా లేక కల్పితమా అని మేము ఇంకా నిర్ధారించుకుంటున్నాము. ఆర్ధిక వ్యవస్థ రెండంకెల వృద్ధి రేటు పెరిగితే అన్నదాత ఆకలితో ఎందుకున్నాడు? అక్కా చెల్లెళ్లలో విషాదం, యువతలో అసంతృప్తి ఎందుకు ఉంది? మార్పు కోసం ఇంత

4