పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉంది. మా సమగ్ర, సంక్షేమ అజెండా అయిన నవరత్నాలలో ఈ దృక్పధం కనిపిస్తుంది. దీనిని సవివరంగా వివరిస్తాను. అంతేగాక,

* గోదావరి జలాలను శ్రీశైలంకు తీసుకురావడం, రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించడం మరియు కృష్ణా ఆయకట్టును స్థిరీకరించడం.
  • ప్రతి గ్రామం మరియు కుటుంబానికి పైపుల ద్వారా త్రాగునీటిని సమకూర్చడం.
  • ప్రతి పట్టణ ఆవాసంలో మురుగునీరు శుద్ధి ప్లాంటులు మరియు ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం.
  • పోలవరం, వంశధార, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ మరియు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం.
  • ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటగిరి హోదాను సాధించడం.
  • విశాఖపట్నంలో మోనోరైల్ ప్రాజెక్టును అమలుచేయడం.
  • పట్టణ ప్రాంతాల నుండి ప్రారంభిస్తూ దశల వారీగా ప్రజా రవాణా వ్యవస్థను శిలాజ ఇంధనాల నుండి విద్యుత్ విధానానికి మార్చడం, తద్వారా మన రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థని పర్యావరణ సుస్థిరత సాధించే విధంగా కట్టుదిట్టం చేయడం.
  • కడప స్టీల్ ప్లాంట్‌ను నిర్మించి, నిర్వహణలోకి తీసుకురావడం.
  • ఆరోగ్యకరమైన జీవనం కోసం స్వచ్ఛమైన మరియు పర్యావరణ సానుకూలత కల్పించడం, పరిరక్షించడం వంటి ముఖ్యమైన అంశాలు మన ముఖ్యమంత్రిగారి దృక్పధంలో ఉన్నాయి.

రాజకీయ అనుబంధం ఆధారంగా పక్షపాతం చూపని నాయకుని నాయకత్వంలోని ప్రభుత్వంలో ఒక భాగం అయినందుకు నేను గర్వపడుతున్నాను. ప్రజలందరికీ వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా మా మేనిఫెస్టోలోని కార్యక్రమాలన్నింటినీ సంపూర్తిగా అందించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రిగారు అధికారులందరినీ ఆదేశించారు. కులం మరియు వారి రాజకీయ అనుబంధం ఆధారంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా ప్రజల నిజమైన హక్కులను, సమాన అవకాశాలను అధికారికంగా ఉల్లంఘించిన మునుపటి పాలనా వ్యవస్థకు, ఈ ప్రభుత్వానికీ ఉన్న వ్యత్యాసాన్ని గమనించవలసిందిగా గౌరవ సభ్యులను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నేను కోరుతున్నాను.

3