పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యక్ష, నేను ఈ ఆర్ధిక సంవత్సరానికి సమర్పిస్తున్న బడ్జెటు మహాత్మాగాంధీ యొక్క గొప్ప లక్ష్యాన్ని సాధించే దిశలో మొదటి అడుగు అని మీ ద్వారా సభకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జాతిపిత గాంధీజీ చెప్పిన మాటలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి.

“నేను సత్యానికి తప్ప దేనికి లొంగి ఉండను. సత్యంకాక నేను సేవించవలసిన మరి ఏ దేవుడు లేడు”.

ఏడు తప్పులు చేయకుండా ప్రజలను నిలువరించాలని గాంధీగారు పేర్కొన్నారు. విలువలు లేని రాజకీయం అనేది ఈ తప్పులలో ఒకటి. మరో విధంగా చెప్పాలంటే రాజకీయాలలో విశ్వసనీయత లోపించడం. 43 రోజుల ఈ ప్రభుత్వంలో, పరిపాలనకు మరియు మన రాష్ట్ర అభివృద్ధికి దన్నుగా ఉండే విలువలతో కూడిన రాజకీయాలను పునరుద్ధరించడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రిగారు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజలు కోరినట్లుగా ఒక ధృఢమైన మార్పు ప్రారంభమయిందని తెలియజేయడానికి ఈ విలువలు ఒక సంకేతం.

4. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోను ఎన్నికలలో గెలవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాయి. తరువాత దానిని మరిచిపోతున్నాయి. ఇది అనైతికం. కానీ, మన గౌరవ ముఖ్యమంత్రిగారు తన ప్రారంభోత్సవ ప్రసంగంలోనే పార్టీ మేనిఫెస్టో అత్యంత పవిత్రమైన గ్రంథానికి సమానమని ప్రకటించి, ఒక క్రొత్త ఒరవడికి నాంది పలికారు. మా మేనిఫెస్టో కేవలం ఒక ప్రకటన పత్రంగా ఉపయోగించడానికి ఉద్దేశించినది మాత్రమే కాదు. ఇది ఈ ప్రభుత్వానికి ఒక నిర్వహణా నియమ సంపుటిగా ఉండటమే కాకుండా ఒక ప్రధాన నియమావళిగా ఉంటుంది.

5. ఈ బడ్జెట్ ద్వారా ప్రజల సంక్షేమానికి మరియు వారి కన్నీటిని తుడవడానికి గట్టి నిబద్ధతతో సురాజ్యం దిశగా ఈ ప్రభుత్వం చర్యలను కూడా తీసుకుంటున్నది. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిగారి సమర్ధ నాయకత్వంలో ప్రజలకు చేసిన వాగ్ధానాలను నెరవేర్చడానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని మరియు కార్యాచరణ ప్రణాళికలను కలిగివుంది. ఈ లక్ష్యం మన సమగ్ర సంక్షేమ అజెండాను స్పష్టపరుస్తున్నది. ప్రభుత్వం తమ వెన్నంటే ఉంటుందనే రైతాంగ నమ్మకంతో, తమ పిల్లల విద్యాభ్యాసంపై ప్రతి కుటుంబం ధైర్యంతో, ఉద్యోగావకాశాలపై విశ్వాసంతో యువత ఉండాలని ఈ

2