పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్పించవచ్చునని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవం అయిన అక్టోబరు 2, 2019 తేదీన ప్రారంభిస్తాము. గాంధీజీ ప్రభావం మన దేశం, అలాగే ప్రపంచంపై శాశ్వతంగా కొనసాగేందుకు ఇది ఒక నివాళి.

పౌర సరఫరాలు

56. తక్కువ బరువు, తక్కువ నాణ్యత, తినడానికి వీలులేని సరుకులు, లీకేజీలు, సరుకులను బహిరంగ మార్కెట్లోకి రీసైకిల్ చేయడం వంటి అంశాలతో వ్యవస్థ ఇబ్బంది పడుతున్నదన్న విషయం ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద సరకులను కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సమస్యలను ఒక్క సారిగా పరిష్కరించేటట్లు చూడటానికి, మన ప్రభుత్వం డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెడుతున్నది. అన్ని సరుకులు మంచి నాణ్యమైనవిగా ఉంటాయి. నూకలను వేరు చేసి, తొలగించి, మంచి నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి గ్రామ / వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సరఫరా చేయడమవుతుంది. ఇందువల్ల హామీతో కూడిన నాణ్యమైన సరకులను అందించడమే కాకుండా 'సార్టెక్స్' మరియు ఇతర గ్రేడింగ్ యంత్రాంగాల ద్వారా ప్యాకింగ్ దశలోనే నాణ్యతను తనిఖీ చేయడానికి వీలవుతుంది. ఈ కార్యక్రమం కోసం రూ. 3,750 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

మహిళా సంక్షేమం

“మహిళల పురోభివృద్ధిని కొలబద్దగా చేసుకొని మాత్రమే నేను ఏ సమాజ పురోగతినైనా అంచనా వేస్తాను”

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్.

57. మహిళల ఔన్నత్యమంతా వారి సంకల్పబలంలోనే ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలతో కుంగి కృశించి పోయే వారు కొందరైతే - ఆ సమస్యలు రాజేసిన అగ్నినే ఇంధనంగా మార్చుకొని రివ్వున ఆకాశంలోకి ఎగిరేవారు మరికొందరు. మహిళాభివృద్ధి ద్వారానే సుస్థిర మరియు సమ్మిళిత పరిపాలనను సాధించగలమని ఈ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ఈ దిశగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఈ ప్రభుత్వం

22