పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమలుచేస్తున్నది. ఈ ఆర్థిక సహాయం పరపతి ఖర్చును గణనీయంగా తగ్గించి, తిరిగి చెల్లింపును ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆదాయకల్పన కార్యకలాపాలను చేపట్టడంతో లక్షలాది మంది మహిళలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇందుకొరకు రూ. 1,140 కోట్ల బడ్జెటు వ్యయంతో 6,32,254 గ్రామీణ స్వయం సహాయక బృందాలకు, 1,66,727 పట్టణ స్వయం సహాయక బృందాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆశించడమయింది.

షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగల ఉప-ప్రణాళిక

58. షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగల వారు ప్రభుత్వం పట్ల వారి పూర్తి నమ్మకం మరియు విశ్వాసాన్ని ఉంచారు. వారి స్థిరమైన మద్ధతుకు మా ధన్యవాదాలు తెలుపుతూ వారి ఉన్నత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని వాగ్దానం చేస్తున్నాం.

59. పారదర్శక విధానంలో ఎస్‌సి మరియు ఎస్‌టి ఉప-ప్రణాళికలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం షెడ్యూల్డు కులాలు అంటే మాల, మాదిగ, రెల్లి మరియు ఇతర కమ్యూనిటీల కోసం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుంది. షెడ్యూల్డు కులాల ఉప-ప్రణాళిక క్రింద, షెడ్యూల్డు కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.15,000.86 కోట్ల మొత్తాన్ని ఈ ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా, షెడ్యూల్డు తెగల ఉప-ప్రణాళిక క్రింద రూ.4,988.53 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. ఈ ప్రభుత్వం ఎస్.సి, ఎస్‌టీ సహోదరుల ఆకాంక్షలను నెరవేర్చి, అభివృద్ధిలో అంతరాలను సమర్ధవంతంగా పూరించేటట్లు చూస్తుంది.

60. పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రిగారికి అందిన విజ్ఞాపననుసరించి 15.62 లక్షల ఎస్.సి కుటుంబాలకు రూ.348.65 కోట్లు, 4.78 లక్షల షెడ్యూల్డు తెగల కుటుంబాలకు రూ.81.70 కోట్లు తగువిధంగా కేటాయిస్తూ షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగలకు ఉచిత విద్యుత్తు యూనిట్ల సంఖ్యను బడ్జెటులో 100 నుండి 200కు పెంచాలని ప్రతిపాదించడమయింది.

61. షెడ్యూల్డు తెగల వారిలో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి డా. వైఎస్ ఆర్ గిరిజన విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.50 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.

23