పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53. మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా, ప్రభుత్వం 300 చదరపు అడుగుల వరకు గల గృహాలకు సంబంధించి పట్టణ గృహనిర్మాణ లబ్ధిదారుల రుణ భారాన్ని మాఫీ చేస్తుంది.

యువత మరియు ఉపాధి ద్వారా ఇంటి వద్దకు పరిపాలన

క్షీరార్థినాం కిం కరిణ్యా?
పాలు కావలసిన వాడికి పాలే ఇవ్వాలి.
ఏనుగునిస్తే ఉపయోగం ఏమిటి ?
నిరుద్యోగులకు కంటితుడుపు భృతులకన్నా
పని కల్పించడం అవసరం.

54. 2022 నాటికి, భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటుంది. ప్రజలు వివిధ కార్యక్రమాలను వినియోగించుకోవడం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు తరచుగా వెళ్ళాల్సిన స్థితిలో మనం ఉండకూడదు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు తమ ఇంటి ముంగిటికే వస్తున్నాయని, సమస్యలను పరిష్కరించుకోవడం తమ హక్కు అని ప్రజలు భావించే పరిపాలనకు స్వాగతం పలకాలని మన ముఖ్యమంత్రిగారు భావిస్తున్నారు. ఈ లక్ష్య సాధన కోసం గ్రామ / వార్డు వాలంటీర్ల కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 2,00,000 మరియు పట్టణ ప్రాంతాలలో 81,000 ప్రజాస్ఫూర్తి కలిగిన యువ వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటాము. ప్రతి 50-100 గృహాల సముదాయానికి ఈ సేవలను అందించడానికి, వాటిని ఒకే చోటకు సమీకరిస్తూ ఈ కార్యక్రమాన్ని 2019, ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభిస్తాము.

55. అదే స్పూర్తితో, సంబంధిత యంత్రాంగాన్నంతటినీ గృహ పరివారాలకు దగ్గరగా తీసుకురావాలని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. 10 మంది ఉద్యోగులతో సుమారు 2,000 మంది జనాభాకు గ్రామ సచివాలయాన్ని మరియు 5 మంది ఉద్యోగులతో సుమారు 5,000 మంది జనాభాకు వార్డు సచివాలయాన్ని నెలకొల్పడం ఈ దిశగా తీసుకున్న ఒక చర్య. దీనివల్ల గ్రామ సచివాలయంలో సుమారు 1,00,000 కొత్త ఉద్యోగాలు మరియు వార్డు సచివాలయంలో సుమారు 15,000 కొత్త ఉద్యోగాలు

21