పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పక్షిగాం బలమాకాశం
మత్యానాం ఉదకం బలం

అంటే,

పక్షులకు ఆకాశమే బలం, చేపలకు వీళ్ళే బలం, మరి పిల్లలకు ....?
అమ్మ ఒడే బలం.

38. ఎన్ని కష్టాలొచ్చినా, వాటిని ఎదుర్కొని తమ బిడ్డలను బాగా చదివించుకోవాలని, వారి జీవితాలను కొత్తగా నిర్మించాలన్న సంకల్పం ఉన్న అమ్మలకు మన రాష్ట్రంలో కొదవ లేదు. ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగి రాయాలనుకునే ప్రతి తల్లికీ ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తోంది. వారి సంకల్ప బలానికి అవసరమైన వనరులు, తోడ్పాటును అందించడం మా బాధ్యత అని చాటుతోంది.

చదువు అనేది ..

మాతేవ రక్షితి
పితవే హితే నియుంక్తే

అంటే,

తల్లిలా రక్షిస్తుందట
తండ్రిలా మంచి చేస్తుందట.

39. 2011 జనాభా లెక్కల ప్రకారం, జాతీయ నిరక్షరాస్యత రేటు 27 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్లో 33 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలలో నిరక్షరాస్యత చాలా ఎక్కువగా అంటే 40 శాతం ఉంది. కాగా జాతీయరేటు 35 శాతంగా ఉంది. పిల్లలకు సమకూర్చగల ఉత్తమ ఆస్తి నాణ్యమైన విద్యే అని మన గౌరవ ముఖ్యమంత్రిగారు నిరంతరం మనకు గుర్తు చేస్తున్నారు. విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయి మానవ మూలధన అభివృద్ధికి తోడ్పడుతుంది. అందువల్ల, నిరుపేద కుటుంబానికి చెందిన ఏ తల్లీ తన పిల్లల చదువు గురించి బాధపడకుండా చూసేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తన పిల్లలను విద్యావంతులను చేసేందుకు తల్లికి ప్రోత్సాహకాలను అందిస్తున్న ఈ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా

15