పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37. ఆత్మహత్య మరియు ప్రమాద మరణాలు : మన రైతులు కష్టపడి పనిచేసినప్పటికీ వివిధ కార్యక్రమాల ద్వారా అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందించినప్పటికీ, కొన్ని రైతు ఆత్మహత్య సంఘటనలు ఉంటున్నాయన్న వాస్తవాన్ని ఈ ప్రభుత్వం సున్నితమైన అంశంగా పరిగణిస్తుంది. 1,513 రైతుల ఆత్మహత్య సంఘటనలలో కేవలం 391 కేసులను వ్యవసాయ సంబంధ దుస్థితికి సంబంధించినవిగా ప్రకటించడం దురదృష్టకరం. క్లెయింల కచ్చితత్వాన్ని నిరూపించిన తరువాత మిగిలిన 1,122 కేసులకు ఈ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లింపును పరిశీలిస్తుంది. ఇకమీదట రైతుల ఆత్మహత్యలు లేకుండా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయినప్పటికీ, ఇటువంటి సందర్భాలలో రక్త సంబంధీకులకు కలిగే ఆర్ధిక దుస్థితిని తొలగించడానికి ప్రభుత్వం రూ.7 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అదేవిధంగా, మత్స్యకారుల కుటుంబాలకు చెందిన రక్త సంబంధీకులకు కూడా రూ.10 లక్షలను అందించడమవుతుంది. అదే సమయంలో, ఈ సహాయాన్ని వడ్డీ వ్యాపారులకు కాకుండా కుటుంబానికి మాత్రమే అందించేటట్లు చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయాన్ని కట్టుదిట్టం చేయడానికి మేము అవసరమైన శాసనపరమైన /విధానపరమైన చర్యలు తీసుకుంటాం.

అమ్మ ఒడి మరియు విద్య

శ్రీ సరస్వతి నమస్తుభ్యం! వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి ! సిద్ధిర్భవతుమే సదా !!

తినడానికి మూడు రొట్టెలు ఉన్నప్పుడు...
తినవలసిన వాళ్ళు నలుగురు అయినప్పుడు
నాకు ఆకలి లేదు అనే వ్యక్తి అమ్మ !

అమ్మకు స్థానంలేని విద్యా వ్యవస్థ
విగ్రహంలేని ఆలయం లాంటిదే !

కంటిని కాపాడు కోవాలని రెప్పకు తెలుసు,
గుడ్డును రక్షించుకోవాలని పక్షికి తెలుసు.
బిడ్డల్ని బాగా చదివించుకోవాలని తల్లికే తెలుసు.

14