పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31. వ్యవసాయ ఆదాయ పెంపుదల : రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర ఉండేటట్లు చేయడానికి, ఇ-నామ్ అమలును ఈ ప్రభుత్వం శీఘ్రతరం చేస్తుంది. రైతులకు నూటికి నూరు శాతం ఆన్లైన్ చెల్లింపును దశలవారీగా అమలు చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. 13 శీతల గిడ్డంగులను, 24 గోదాముల అభివృద్ధిని కూడా చేపట్టడమవుతుంది. తద్వారా, రైతులు ధరలు తక్కువగా ఉన్నప్పుడు నిల్వ చేసుకునేందుకు, ధరలు ఎక్కువగా ఉన్న రోజులలో విక్రయించుకునేందుకు సులభతరంగా ఉంటుంది. మన రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించి, ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి 17 రైతుబజార్లు ఎంచుకొనడం జరిగింది. శీతల గిడ్డంగులు మరియు గోదాముల అభివృద్ధి కోసం రూ.200 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

32. సాగు నష్ట నివారణ : ముఖ్యంగా ధరల హెచ్చుతగ్గులు మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న అపరిమిత నష్టాల పట్ల మా ప్రభుత్వం చాలా సున్నితంగా వ్యవహరిస్తుంది. అందువల్ల, రైతులకు న్యాయమైన ధర ఉండేటట్లు చేయడానికి వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలలో మార్కెట్ ప్రమేయానికి వీలుకల్పించేందుకు రూ.3,000/- కోట్ల కార్పస్‌తో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసేందుకుగాను ప్రతిపాదిస్తున్నాను. ఇది మునుపటి బడ్జెటు రూ.1,000/- కోట్ల మొత్తానికి మూడు రెట్లు. ఇది కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పి)ను ప్రకటించిన పంటలకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో కనీస మద్దతు ధర ప్రకటించని ఇతర పంటలకు కూడా వర్తిస్తుంది. రైతులకు ఇటువంటి మద్ధతును ప్రతిపాదించిన రాష్ట్రాలలో మన రాష్ట్రమే మొదటిదని తెలియజేయడానికి గర్వపడుతున్నాను. అదేవిధంగా, రూ.2000/కోట్లతో ప్రకృతి వైపరీత్యాల విధిని నెలకొల్పాలని ప్రతిపాదిస్తున్నాను. ఇది వాతావరణ మార్పుల వల్ల నష్టాలు ఏర్పడిన సందర్భంలో రైతులకు సహాయపడుతుంది. ఇందులో, తిత్లీ తుఫాను బాధితుల కోసం రూ.150 కోట్ల మొత్తాన్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

33. కౌలు రైతుల సంక్షేమం : అధికారిక గుర్తింపు లేకపోవడం కౌలు రైతుల సంక్షేమ అవరోధానికి ప్రధాన అంశం. సాగు భూమి యజమానులు కౌలు రైతులను అధికారికంగా గుర్తించడానికి ముందుకు రావడం లేదు. చట్టబద్ధ సదస్సులలో వారు తమ భూమిని కోల్పోతామని భయపడుతున్నారు. సాగుభూమి యజమానుల భయాలను పోగొట్టడానికి, అలాగే కౌలు రైతులు సాగు మద్ధతుని అందుకొనేలా చేయడానికి, ఈ ప్రభుత్వం అవసరమైన శాసన సవరణలను తీసుకురానుంది. పంట బీమా, వడ్డీలేని

12