పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2,000 పి.సి.యు. ల కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రహదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 2 పథకాల ద్వారా మొత్తం 3,104 కిలోమీటర్ల పొడవు గల రహదారులను 479 వంతెనలను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.

మౌలిక సదుపాయాల కల్పన

92. నానాటికీ పెరుగుతున్న సరుకుల రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రామాయపట్నం దగ్గర ఒక గ్రీన్ ఫీల్డ్ రేవు పట్టణాన్ని అభివృద్ధి పరచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఈ విధంగా ప్రతిపాదిస్తున్న రేవుపట్నం పృష్ట భూమిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాలు, తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ రేవు పట్టణాన్ని లాండ్ లార్డ్ మోడల్ లో అభివృద్ధి పరుస్తారు. ఇక్కడ సముద్ర తీరానికి ఎదురుగా ఒక ఆర్టిఫిషియల్ డీప్ హార్బర్‌ను నిర్మించడం జరుగుతుంది. దాని వెనుక బ్రేక్ వాటర్స్ రక్షణ ఉంటుంది. ఈ రేవు పట్టణానికి నావలు రావటానికి వీలుగా 14 కిలోమీటర్ల పొడవైన కాలువ ఉంటుంది. ఇందులో 65 వేల డి.డబ్ల్యు.టి. బరువు మోయగల నౌకలు ప్రయాణించవచ్చు. ఈ రేవు పట్టణం నిర్మాణం మొదటి దశలో 802 ఎకరాల పరిధిలో 4 బెర్త్ లుగా రూ.3,736 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాలు చేపట్టడబతాయి. అలాగే, భావనపాడు రేవు పట్టణం కూడా లాండ్ లార్డ్ మోడల్ తరహాలోనే నిర్మించబడుతుంది. అక్కడ 800 ఎకరాల పరిధిలో మొదటి దశలో 3 బెర్తుల్లో రూ.3,200 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి జరుగుతుంది. ఈ రేవు పట్టణానికి 1.25 వేల డి. డబ్ల్యు.టి. బరువు మోయగల నౌకలు సరుకుల రవాణా చేపడతాయి.

93. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పి.పి.పి. పద్ధతిలో భోగాపురం వద్ద అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించడమైనది. ఈ విమానాశ్రయం సుమారు 2,203 ఎకరాల పరిధిలో నెలకొల్పబడుతుంది. ఇందులో 1,910 ఎకరాల మేరకు విమానయాన సదుపాయాలు, 293 ఎకరాల మేరకు వాణిజ్య నివాస సముదాయాలు ఉంటాయి. వీటితో పాటు విమానాల నిర్వాహణ, మరమ్మత్తులు మొదలైన అంశాలతో

35