పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88. విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతంలో రవాణా సదుపాయాన్ని మెరుగు పరచడం కోసం 140.11 కిలోమీటర్ల పొడవు గల మాస్ రాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టంను అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విశాఖపట్నానికి ఉత్తరాన అభివృద్ధి చెందుతున్న భోగాపురం విమానాశ్రయ ప్రాంతం నుండి దక్షిణాన గల అనకాపల్లి వరకు రహదారి సదుపాయం మరింత అభివృద్ధి చెందుతుంది. 140.11 కిలోమీటర్ల మేరకు ఏర్పరచనున్న ఈ రహదారిలో 79.91 కిలోమీటర్ల మేరకు కారిడార్లు లైట్ మెట్రో రైల్ సిస్టం అభివృద్ధి కోసం, మిగిలిన 60.20 కిలోమీటర్ల మేరకు కారిడార్లు కాటినరీ ఫ్రీ మోడరన్ ట్రామ్ | మెట్రో లైట్ సిస్టం కోసం వినియోగించబడతాయి.

89. రవాణా రంగానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,588.63 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

90. రాష్ట్రంలో రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులను ఎప్పటికప్పుడు ఉన్నతీకరించడానికి, అభివృద్ధి పరచడానికి, వెడల్పు చేయడానికి ప్రభుత్వం ఎన్నో పనులు చేపడుతున్నది. ఇందుకు బడ్జెటు కేటాయింపులతో పాటు, నాబార్డు నుండి ఇతర సంస్థల నుండి నిధులను సమకూర్చుకుంటున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 256 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులను అభివృద్ధి పరచడంతో పాటు, 3 వంతెనల నిర్మాణం కూడా జరిగింది. సి.ఆర్.ఎఫ్. పథకం కింద 505 కిలోమీటర్ల మేరకు రహదారుల్ని అభివృద్ధి పరచారు. వీటితో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మరొక 700 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి పరచటానికి ప్రతిపాదించడమైనది.

91. న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు - ఆర్థిక సహాయంతో 70:30 నిష్పత్తిలో ఖర్చులు భరించే పద్ధతి మీద ప్రభుత్వం 2 ప్రాజెక్టులను మొదలు పెట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రోడ్డు & బ్రిడ్జెస్ రికన్స్ట్రక్షన్ ప్రాజెక్టు రాష్ట్ర రహదారుల్ని, వంతెనల్ని అభివృద్ధి పరచడం మీద దృష్టి పెడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటి & రూరల్ కనెక్టివిటి ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టు జిల్లా, మండల, కేంద్ర కార్యాలయాల మధ్య రెండు వరుసల రహదారి వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు గాను రోజుకి

34