పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాటు ఒక ఏవిషయేషన్ అకాడమీని కూడా తప్పనిసరిగా నెలకొల్పవలసి ఉంటుంది. ఇందులో అభివృద్ధి అవసరాల కోసం 500 ఎకరాల మేరకు ప్రభుత్వ ఆధీనంలో ఉంది.

ఎనర్జీ రంగం

94. రాష్ట్రంలోని వినియోగదారులందరికీ 24X7 చొప్పున చౌక ధరకు నాణ్యమైన విద్యుత్తు సరఫరాను అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. కానీ, ఈ ప్రభుత్వం అధికార బాధ్యత చేపట్టాక విద్యుత్తు రంగ పరిస్థితుల్ని పరిశీలిస్తే అవి, మామూలుగా ప్రజలు భావిస్తునట్లుగా కాక, తీవ్ర సంక్షోభంలో కూడుకుపోయి కనబడ్డాయి. దాదాపు 20 వేల కోట్ల మేరకు విద్యుత్తు కొనుగోళ్ళ బకాయిలు పోగుపడ్డాయి. వీటితో పాటు రూ.29,147 కోట్ల మేరకు డిస్కంల నష్టాలు, రూ.15,500 కోట్ల మేరకు డిస్కంలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు కూడా పేరుకు పోయి కనబడ్డాయి. ఇంత తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పటికి మేము విద్యుచ్ఛక్తి రంగం కుప్పకూలిపోకుండా నిలబెట్టగలిగాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 13 వేల కోట్ల మేరకు నిధులు విడుదల చేశాం. ఈ మొత్తం గత 5 సంవత్సరాల్లో విద్యుత్తు రంగానికి విడుదల చేసిన నిధులన్నిటి కన్నా ఎక్కువ. విద్యుచ్ఛక్తి రంగంలో 75% కన్నా ఎక్కువ వ్యయం ప్రధానంగా విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన ఖర్చులే. కాబట్టి అన్నింటికన్నా ముందు గతంలో చేపట్టిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో ఎక్కడెక్కడ అధిక ధరలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారో వాటన్నిటిని ప్రభుత్వం సమీక్షిస్తున్నది. దీర్ఘకాలం పాటు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు సరఫరా కొనసాగించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌ను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 8 వేల మెగావాట్ల నుండి 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు ఉత్పాదనను చేపట్టనున్నది.

95. రాష్ట్ర విభజన అనంతరం మన ఇంధన భద్రత కుంటుపడింది. ఇందుకు కారణం మనం మన బొగ్గు గనులను, జల విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యాన్ని కోల్పోవలసి రావటమే. దానివల్ల ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో తన బొగ్గు గనులను సమకూర్చుకోవటం కోసం, అలాగే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్తు ఉత్పాదన వ్యయాన్ని తగ్గించడం

36