పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80. రాజధాని ప్రాంత సామాజిక భద్రత నిధి కింద రాజధాని నగర ప్రాంతంలోని భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలవారీ పెన్షన్ రూ.2,500 చొప్పున నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ జరుగుతున్నది. 2019 డిసెంబరు దాకా 20,092 మంది పెన్షనర్లకు రూ. 52.50 కోట్లు పంపిణీ జరిగింది.

సాగునీటి వనరులు

81. ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థ పురోగతి చెందడానికి సాగునీటి వనరుల కల్పన తప్పనిసరి. ఇందుకు గాను ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి, నదుల అనుసంధానానికి, భూతల, భూగర్భ జలవనరులను సక్రమంగా వినియోగించడానికి చర్యలు చేపడుతున్నది. తద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తగినంత సాగునీరు అందించాలని ప్రయత్నిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవధార అని చెప్పదగ్గ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది.

82. ఒక వైపు రాయలసీమలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు పదే పదే పునరావృతమవుతూ ఉండగా, కృష్ణానది నుండి మనకి కేటాయించబడ్డ మనవాటా నీళ్ళని మనం వాడుకోలేక పోవడం ఒక వైరుధ్యం. కృష్ణానదికి వరదలు సంభవించే కొద్దిపాటి కాలవ్యవధిలోనే ఆ జలాల్లో మన వాటా మనం పొందటానికీ, చెన్నై నగరపు దాహార్తి తీర్చడానికి మనమిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోడానికి రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ ఏర్పాటయింది. ఈ పథకం రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా రాయలసీమకి వరం అని చెప్పవచ్చు.

83. అలాగే గోదావరి-పెన్నా నదుల అనుసంధానం తో పాటు, పల్నాడు రైతుల సంక్షేమార్థం వరికసెలపూడి ఎత్తిపోతల పథకాన్ని వై.యస్.ఆర్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్లో విలీనం చెయ్యడం జరుగుతుంది.

84. జగ్జీవన్ రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, వంశధార-నాగావళి అనుసంధాన పథకాల మీద మరింత దృష్టి పెట్టడం ద్వారా ఉత్తరాంధ్ర రైతులకు ఒక బాసట కల్పించడానికి

32