పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంక్షేమం

54. మానవ వనరుల అభివృద్ధిలో ఇంతవరకు వెనుకబడిన సామాజిక వర్గాల అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం తప్పనిసరి. అన్ని సామాజిక వర్గాలూ ప్రధాన స్రవంతిలో పాలు పంచుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాలనేది మా ప్రయత్నం. కుల, మతాలకూ, లింగ, వృత్తి వివక్షతకూ అతీతంగా, సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సుకూ మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెన్షన్లు

55. అర్హులైన అందరి లబ్ధిదారులకు వారి ఇంటి గుమ్మం దగ్గరే వై.యస్.ఆర్. పెన్షన్లను పెంపుదల చేసిన రేట్ల ప్రకారం ప్రభుత్వం అందిస్తున్నది. వృద్ధాప్య పెన్షన్ల వయో పరిమితిని 65 ఏళ్ళ నుండి 60 ఏళ్ళకు తగ్గించడం జరిగింది. 2019 జూన్ నుండి పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య 55,99,024 కు పెరిగింది. ఈ పథకం పారదర్శకంగా అమలు జరగడం కోసం పెన్షన్లు పొందడానికి అర్హులైన వారి జాబితాను గ్రామ సచివాలయాల్లో రైస్ కార్డుల అర్హుల జాబితాతో పాటు ప్రకటించడం జరుగుతుంది. లాక్ డౌన్ సందర్భంలో కూడా పెన్షన్లను గుమ్మంవద్దనే పంపిణీ చేసిన గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ పటుత్వం తెలుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వై.యస్.ఆర్. పెన్షన్ కోసం రూ.16,000 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న అమ్మ ఒడి

56. బడి ఈడు పిల్లలు నూటికి నూరు శాతం బడిలో చేరాలనీ, వాళ్ళు బడి మానకుండా ఉండాలనీ, వారి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడాలని కోరుకుంటూ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసిన కార్యక్రమం ఇది. దారిద్ర్యరేఖకు దిగువున ఉండి తమ పిల్లల్ని 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా బడికి పంపిస్తున్న 42,33,098 మంది తల్లులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టిన మొదటి ఏడాదే ఈ పథకం కింద 8,68,233 మంది

22