పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దిశా పోలీసు స్టేషన్లుగా ఉన్నతీకరించడం, దిశా ఫోరెన్సిక్ లేబొరీటరీల ఏర్పాటుకు సదుపాయాలను సమకూర్చడం, దిశా కాల్ సెంటర్, దిశా యాప్‌లను ప్రారంభించడం, జిల్లా ఆసుపత్రులలోనూ, బోధనా ఆసుపత్రులలోనూ దిశా సౌకర్యాల ఏర్పాటులతో పాటు స్త్రీల పట్ల, పిల్లల పట్ల లైంగిక అత్యాచారాల విచారణకు సంబంధించి నిర్ధిష్ట నియమ నిబంధనలను రూపొందించడం కూడా జరిగింది.

ప్రజా పంపిణీ వ్యవస్థ

51. ప్రస్తుతం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 1,47,25,346 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. 'వై.యస్.ఆర్. నవశకం' పథకంలో భాగంగా ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న అర్హులైన కుటుంబాల వారికి కొత్త రైస్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది. అర్హతా ప్రమాణాలు రూపొందించి చాలా ఏళ్ళు కావస్తున్నందు వలన వాటిని సవరించడం జరిగింది. పాత ప్రమాణాలు ప్రకారం పరిగణనలోకి రాకుండా ఉండిపోయిన అర్హత కలిగిన కుటుంబాలు అన్నింటినీ ఇంటింటి సర్వే ద్వారా గుర్తించడం ఈ కొత్త ప్రమాణాల ఉద్దేశ్యం.

52. ప్రస్తుతం ఉన్న పౌర పంపిణీ వ్యవస్థను సంస్కరిస్తూ, తద్వారా ప్రజలకు మరింత ఆహార పోషణ భద్రతను కల్పించడం కోసం అన్ని కుటుంబాలకు పౌర సరఫరాలు నూటికి నూరు శాతం అందేటట్లు చూడటం కోసం ప్రభుత్వం కొత్తగా డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. 5, 10, 15, 20 కేజీల బరువు గల సోర్టెక్స్ క్వాలిటీ బియ్యంతో పాటు, పంచదార, కందిపప్పు కూడా ఇప్పుడు ప్రజల ఇంటి ముంగిటకు చేరుతున్నాయి. గ్రామ, వార్డు కార్యకర్తల ద్వారా ఈ పౌర పంపిణీ ఎటువంటి అవకతవకలకు తావులేని విధంగా చేపట్టబడుతుంది.

53. ఈ పథకాన్ని 2019 సెప్టెంబరు 6న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రానున్న రోజుల్లో దశల వారీగా ఈ పథకం అన్ని జిల్లాలకు విస్తరించబడుతుంది.

21