పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వవిత్తన కేంద్రంగా తీర్చిదిద్ది తద్వారా తక్కువ ధరకు మేలురకమైన విత్తనాలు లభ్యమయ్యే దిశగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన అయోవ (IOWA) రాష్ట్ర విశ్వవిద్యాలయ సౌజన్యంతో కర్నూలు జిల్లాలో 650 ఎకరాల మెగా విత్తన పార్క్‌ను ప్రభుత్వం ఏర్పర్చింది.

28. రాష్ట్రంలో అదనపు భూగర్భ జలాలు లభ్యమయ్యే ప్రాంతాలలో చిన్న, సన్నకారు రైతులనిమిత్తం సోలార్ బోర్ వెల్స్ తవ్వకాన్ని 'ఎన్.టి.ఆర్. జలసిరి Phase-II' కార్యక్రమం ద్వారా మా ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో మంజూరు చేసింది. 35,508 లబ్దిదారులకు మేలు చేకూరుస్తూ 88,770 ఎకరాలు సాగులోకి వచ్చాయి.

29. బిందు సేద్యం ద్వారా అధిక రాయితీలను అందిస్తూ, కరువుకు ఆలవాలమైన రాయలసీమను ఉద్యాన సీమగా మార్చటానికి మా ప్రభుత్వం నడుం బిగించింది. తద్వారా వ్యవసాయ GVAలో రాయలసీయ జిల్లాలు అగ్రగామిగా ఎదగటానికి తోడ్పాటులభించి 7.25 లక్షల రైతులకు లబ్ధి చేకూరి 7.3 లక్షల హెక్టార్ల భూమి సస్యశ్యామలమైంది.

30. విలువను జోడించటం ద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించవచ్చు అనే మా ప్రభుత్వ నమ్మకానికనుగుణంగా, ఆహార ప్రక్రియ పరిశ్రమలకు రూ.300 కోట్లు ప్రతిపాదిస్తున్నాను.

31. కనీస మద్దతు లేని పంటల విషయంలో విపణి అనిశ్చితికి రైతులు నష్టపోకుండా ప్రస్తుతమున్న విపణి ప్రమేయ నిధిని 500 కోట్ల రూపాయల నుండి 2019-20 సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయలకు పెంచడానికి మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది.

32. కౌలు రైతులకు సంస్థాగత ఋణం, పంట భీమా, వ్యవసాయపు పనిముట్లు, ఉత్పాదక రాయితీ వంటి సదుపాయాలు కల్పించడం కోసం భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా సాగు ప్రమాణ పత్రాన్ని మా ప్రభుత్వం పరిచయం చేసింది. 2014-15 సంత్సరంలో 1.34 లక్షల కౌలు రైతులు తీసుకున్న ఋణ మొత్తు 272 కోట్ల రూపాయలు కాగా 2018-19 సంత్సరానికి 11.06 లక్షల కౌలు రైతులు 4,957 కోట్ల రూపాయల మేరకు ఋణ సౌకర్యాన్ని పొందారు.

38. పశువుల రంగాన్ని ప్రోత్సహించడానికి, ప్రతి గ్రామంలో పశుగ్రాస ఉత్పత్తిలో స్వయం సాఫల్యతను సాధించేందుకు పశుగ్రాస భద్రతా విధానాన్ని ప్రవేశపెడుతూ 83,396 ఎకరాలలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేయడమైనది. పశుగ్రాసం మరియు ఆహారం అభివృద్దికి గాను 2019-20 సంవత్సరానికి నేను 200 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. పశువులపై బీమా కొరకు 200 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో నేను కేటాయిస్తున్నాను. మత్స్య పరిశ్రమ రంగానికి ఊతమివ్వడానికి, 2015-16 సంవత్సరంలో యూనిట్ ఒక్కటికి ఉన్న 4.13 రూపాయల చేపల పెంపకంపై విద్యుత్ టారీఫ్ 2018-19 సంవత్సరంలో 2 రూపాయలకు తగ్గించటం జరిగింది.

7