పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రైతుల సంక్షేమం

22. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూలవార్షికోత్పత్తిలో 32 శాతం వాటాను వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శ్రామిక వర్గంలోని షుమారు 58 శాతం అందిస్తున్నారు. ఈ కారణంగా, మా ప్రభుత్వం ఈ రంగాన్ని పరిపూర్వక అభివృద్ది పెంపొందించే క్రమంలో కీలకమైన భాగస్వామిగా పరిగణిస్తుంది. ఋణమాఫి మరియు మెరుగైన ఉత్పాదక రాయితీల ద్వారా వ్యవసాయ వ్యాకులతను ఉపశమింప చేయటం మా ప్రధాన వ్యూహంగా భావిస్తూ రైతుల ఆదాయం స్థిరంగా వృద్ధి చేయటానికి కరువు నివారణ, మెరుగైన పెట్టుబడులు, వ్యవసాయ యాంత్రీకరణ, కౌవులుదారు రైతులకు అరువు సౌకర్యాలను పెంపొందించుట, ధరల హెచ్చుతగ్గుల నుండి రక్షణ కల్పించుట వంటి చర్యలపై దృష్టి సారించటం జరిగింది.

23. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని గుర్తించిన మన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు 'అన్నదాతకి ఆప్త బాంధవుడి'గా 24,000 కోట్ల రూపాయల ఋణభారం నుంచి రైతులను విముక్తుచేశారు. ఆఖరిరెండు వాయిదాలను త్వరలోనే జమచేయడం జరుగుతుంది. ఉద్యాన రంగంలో 2.23 లక్షల మంది రైతులకు 384 కోట్ల రూపాయల ఋణ ఉపశమనం కల్పించాం.

24. మా ప్రభుత్వం రైతులను ఆదుకొనేందుకు మరో వినూత్న పథకం, 'అన్నదాత సుఖీభవ” ప్రవేశపెడుతుంది. 2019-20 సంవత్సరానికి ఈ పథకానికి 5000 కోట్ల రూపాయలను నేను ప్రతిపాదిస్తున్నాను.

25. మా ప్రభుత్వం వివిధ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ పెంచి వరి, చెఱకు, ప్రత్తి మరియు వేరుశెనగ పంటలకు ఉన్న రాయితీని 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు, మొక్క జొన్న పంటకు 8,353 రూపాయల నుండి 12,500 రూపాయలకు, పప్పు ధాన్యాలు మరియు పొద్దుతిరుగుడు పంటకు 6,250 రూపాయల నుండి 10,000 రూపాయలు చేసింది. దీనివల్ల 39.33 లక్షల రైతులు లబ్ది పొందారు.

26. వ్యవసాయ ఆదాయాన్ని స్థిరంగా వృద్ధిచేయుట కొరకు, ఉత్పాదక మెరుగుదలకై సూక్ష్మపోషక రాయితీని 100 శాతానికి పెంచటం మరియు చంద్రన్న రైతు క్షేత్రాలు, పోలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా వివిధ స్థిరీకరణ చర్యలను బలోపేతం చేయటంపై దృష్టి సారించింది. వ్యవసాయ ఆదాయాన్ని వృద్ధి చేయుటకు, ఆరోగ్యాన్ని ప్రోత్సహించుటకు మరియు పర్యావరణాన్ని పరిరక్షించుటకు మా ప్రభుత్వం 'జీరో బడ్జెట్ సహజ సేద్య విధానాన్ని ప్రోత్సహించింది. ఈ విధానం ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ ఆర్థిక వేదిక వంటి అంతర్జాతీయ సంస్థలచే ప్రశంసలు అందుకుంది.

27. వ్యవసాయ వ్యయాన్ని తగ్గించటానికి మా ప్రభుత్వం యాంత్రీకరణను ప్రోత్సహిస్తుంది, uberisation ద్వారా యంత్రపరికరాలను పంపిణీ చేస్తుంది. అలాగే, 2.5 లక్షల రూపాయల గరిష్ణ రాయితీతో ట్రాక్టర్లు మరియు rotovator లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించటం జరిగింది. విత్తన పరిశ్రమలో పరిమిత మౌలిక సదుపాయాలను గుర్తించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను

6